తిరుపతి ఉప ఎన్నిక : కులాల కుమ్ములాట, మరే విధంగా చూసుకున్న జగన్ పార్టీ గెలుపు ఖాయం
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాన పార్టీలు అయిన వైకాపా, తెలుగు దేశం పార్టీ, బీజేపీలు హోరా హోరీగా ప్రచారం అయితే చేశాయి. ఎస్సీ సామాజిక వర్గంకు ఆ నియోజక వర్గం కేటాయించడం జరిగింది. కనుక పోటీ చేసిన అభ్యర్థుల్లో గురుమూర్తి, పనబాక లక్ష్మి మరియు చింత మోహన్ లు మాల సామాజిక వర్గం వారు కాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రమే మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు. సామాన్యంగా ఇలాంటి ఎన్నికల్లో కులాలు మరియు మతాల ప్రాతిపధికన ఓట్లు పడ్డా కూడా గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం తక్కువ. ఈ సారి కూడా మాదిగల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నా కూడా గెలిచేది మాత్రం మాల సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థి అంటూ బలమైన విశ్లేషణ వినిపిస్తుంది.
gurumurthy : గురుమూర్తి ని అడ్డుకునే వారే లేరు..
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండే చాలా ప్లాన్ చేసి ఈ నియోజక వర్గం నుండి గురుమూర్తిని రంగంలోకి దించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే గురుమూర్తి విజయంను ఖాయం చేశాడు అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వైకాపానే ఈ ఎన్నికల్లో గెలుపొందుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. గురుమూర్తి పార్టీ నాయకత్వం పెట్టుకున్న నమ్మకంను నిలిపే విధంగా ఘన విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
gurumurthy : మాదిగ మాల సామాజిక వర్గాల్లో…
తిరుపతి ఉప ఎన్నికల్లో మాదిగ మాల సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు కీలకంగా మారాయి. మాల సామాజిక వర్గంకు చెందిన వారు పోటీలో ఎక్కువగా ఉండటం వల్ల అటుగా ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇక మాదిక సామాజిక వర్గంకు చెందిన వారు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండటం వల్ల వారు వైకాపాకు ఓట్లు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మొత్తంగా మాదిక సామాజిక వర్గం నుండి పడే ఓట్లతో వైకాపా గెలుపు ఖాయం అని అది కూడా భారీ మెజార్టీతో అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.