Valentines Day : ప్రేమికులు ఎక్కడ…? ఖాళీగా హైదరాబాద్ పార్కులు…!
Valentines Day : ప్రేమికుల దినోత్సవం అనగానే హైదరాబాద్ లో పార్కులు అన్నీ కూడా దాదాపుగా సందడి సందడిగా కనపడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చిన ప్రేమికులు హైదరాబాద్ లో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ పార్కుల్లో సందడి చేస్తూ ఉంటారు. హైదరాబాద్ పార్కుల్లో అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.
అయితే ఈ ఏడాది మాత్రం పార్కులు అన్నీ బోసిపోయి కనిపించాయి. ఇందిరా పార్కు , సంజీవయ్య పార్కు , నెక్లస్ రోడ్డు , హుసేన్ సాగర్ లో వాలెంటైన్స్ డే సందడి పెద్దగా కనపడలేదు. పార్క్ లు వద్ద పోలీసుల బందోబస్తు దీనికి కారణంగా తెలుస్తుంది. గతాన్ని భిన్నంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

today Valentines Day empty hyderabad parks
ప్రేమికులకు పెళ్లిళ్లు చేయబోమని స్పష్టం చేసిన భజరంగ్ దళ్… ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకం అంటుంది. ప్రేమికులు కనిపిస్తే పుల్వామా దాడి లో వీరమరణం పొందిన సైనికులకు ప్రేమికుల చేత నివాళులు అర్పింపచేస్తామని భజరంగ్ దళ్ చెప్తుంది. ఏది ఎలా ఉన్నా సరే పార్కుల వద్ద ఆదాయం మాత్రం భారీగా పడిపోయింది.