Today Petrol Diesel prices : నిలకడగా పెట్రోల్ డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా..!
Today Petrol Diesel prices : ఇటీవల కేంద్రం తీసుకున్న ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయంతో… దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. దీంతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.20గా ఉండగా… లీటరు డీజిల్ ధర రూ.94.62 గా ఉంది.
ఇక ఏపీ విజయవాడ మార్కెట్‌లో లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.53గా ఉంది. అయితే నిన్నటి ధరతో పోలిస్తే ఇక్కడ ఓ రూ.0.12 పైసలు పెరిగింది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 10 పైసలు పెరిగి రూ.96.59 గా ఉంది. ఇక తిరుపతి మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు భారీగా పెరిగింది.లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.2.25 పెరిగింది.

02 january 2022 Today Petrol diesel prices in telangana and ap states
దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.112.79 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.2.02 పైసలు తగ్గి రూ.98.58 కి చేరింది. గత 3 నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది.