Pawan Kalyan : గగ్గోలు పెడుతున్న పవన్ కళ్యాణ్ నిర్మాతలు.. ఇదెక్కడి దారుణం సారూ?
Pawan Kalyan : రెండు పడవల ప్రయాణం ఎప్పటికైనా.. ఎవరికైనా మంచిది కాదు. ఏ రంగంలో కూడా రెండు పడవల ప్రయాణం చేసిన వారు సక్సెస్ అవ్వలేదు అనేది చాలా మందిని చూసి మనం తెలుసుకున్నాం. రెండు విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని రెండు పడవల ప్రయాణం అంతకు మించి డేంజర్ అనేది కూడా చాలా మందికి అనుభవం రీత్యా తెలియవచ్చింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం తన రెండు పడవల ప్రయాణం మానుకోవడం లేదు. అలా రెండు పడవల ప్రయాణంతో ఇండస్ట్రీలో నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు.
పవన్ కళ్యాణ్ సినిమా ల్లో హీరోగా నటించడం మానేసి రాజకీయాల్లో పూర్తి స్థాయి లో బిజీ అవుతాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. కాని తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్థిక అవసరాల నిమిత్తం తాను సినిమా లను కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. తాను సినిమాల్లో చేస్తూనే రాజకీయాల్లో ఉంటాను అన్నాడు. దాంతో అటు ఇటు రెండు పడవల ప్రయాణం మొదలు పెట్టాడు. అలా రెండు పడవల ప్రయాణం చేయడం వల్ల ఇప్పుడు చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది నిర్మాతలు. పవన్ వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. అయిదుగురు ఆరుగురు నిర్మాతల నుండి పదుల కోట్లలో పారితోషికంను అడ్వాన్స్ గా తీసుకున్నాడు.

Tollywood Producers not happy with Pawan Kalyan politics
ఇప్పుడు పవన్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు సినిమా లు చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. 2024 లో ఎలాగూ ఎన్నికలు ఉన్నాయి. కనుక మళ్లీ సినిమా ల్లో ఆయన నటించేది 2024 ఎన్నికల తర్వాతే. కనుక అప్పటి వరకు నిర్మాతలు తమ అడ్వాన్స్ లను కోల్పోయినట్లే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తంలో పవన్ కు ఇవ్వడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అంటూ కొందరు నిర్మాతలు లోలోపల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పవన్ సార్ ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ మీరే ఆలోచించండి..!