Tomato Farmer : కోటీశ్వరుడైన టమాటా రైతు.. తనకు వచ్చిన లాభాలతో కూలీలకు ఏం చేశాడంటే?
Tomato Farmer : కోటీశ్వరులు ఎవరు అవుతారు చెప్పండి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్లు. అంతే కదా.. కానీ.. ఒక రైతు కోటీశ్వరుడు అవుతాడని ఎప్పుడైనా కలగన్నారా? అది అసాధ్యం అని మొన్నటి వరకు అనుకున్నాం కానీ.. ఇప్పుడు దాన్ని సుసాధ్యం చేశారు టమాటా రైతులు. టమాటా పండించిన రైతులంతా ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. అలాంటి రైతుల గురించి రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. ప్రస్తుతం టమాటా ధర […]
Tomato Farmer : కోటీశ్వరులు ఎవరు అవుతారు చెప్పండి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్లు. అంతే కదా.. కానీ.. ఒక రైతు కోటీశ్వరుడు అవుతాడని ఎప్పుడైనా కలగన్నారా? అది అసాధ్యం అని మొన్నటి వరకు అనుకున్నాం కానీ.. ఇప్పుడు దాన్ని సుసాధ్యం చేశారు టమాటా రైతులు. టమాటా పండించిన రైతులంతా ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. అలాంటి రైతుల గురించి రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. ప్రస్తుతం టమాటా ధర రూ.150కి పైనే నడుస్తోంది. అందుకే.. టమాటా పండించే రైతులకు సిరులు కురిపిస్తోంది టమాటా.
నిజానికి ఒకప్పుడు టమాటా ధరల బాధలను కూడా చూశాం. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రోడ్ల మీద పడేసి వెళ్లిన సందర్భాలను చూశాం. కానీ.. నేడు టమాటా రైతు సగర్వంగా తల ఎత్తుకొని బతుకుతున్నాడు. ఏపీలోకి చెందిన ఓ రైతు కూడా టమాటాలు పండించి కోట్లు సంపాదించాడు. కానీ.. తన పొలంలో టమాటాలు పండించే సమయంలో కొందరు కూలీలతో పని చేయించుకున్నాడు. వాళ్లు సరిగ్గా పని చేయడం వల్లే తనకు పంట బాగా పండిందని గ్రహించి ఆ రైతు ఏం చేశాడో తెలిస్తే అతడికి చేతులెత్తి మొక్కుతారు.
Tomato Farmer : కూలీలకు కొత్త బట్టలు కొనిచ్చిన రైతు
ఏపీలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలానికి చెందిన నరసింహరెడ్డి అనే రైతుకి కూడా టమాటా పంట ద్వారా బాగా లాభాలు వచ్చాయి. దీంతో తన పంట బాగా పండటానికి కష్టపడ్డ కూలీలను పిలిచి.. వాళ్లకు కొత్త బట్టలు అందజేశాడు. అలాగే.. తనను కోటీశ్వరుడిని చేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. కూలీలే కదా అని చిన్నచూపు చూడకుండా వాళ్లకు కొత్త బట్టలు కొనిచ్చి తన లాభాల్లో కొంత డబ్బును వాళ్లకోసం వెచ్చించిన ఆ రైతును చూసి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు.