Tomato Farmer : టమాటాలు కిలో రూ.80 మాత్రమే.. తక్కువ ధరకే అమ్ముతున్న రైతు.. అభినందిస్తున్న గ్రామస్తులు..!
Tomato Farmer : చాలామంది బిజినెస్ లు ఎందుకు చేస్తారు. జాబ్ లు ఎందుకు చేస్తారు అని ప్రశ్నిస్తే డబ్బు కోసం అని అంటారు. అవును.. ఏ పని చేసినా మన లక్ష్యం డబ్బే కదా. అది కూలి పని కావచ్చు.. మేస్త్రీ పని కావచ్చు.. మరేదైనా పని కావచ్చు. ఐటీ ఉద్యోగి అయినా.. ప్రభుత్వ ఉద్యోగి అయినా.. మరే ఉద్యోగి అయినా.. వ్యాపార వేత్త అయినా.. చివరకు చిన్న టీ కొట్టు పెట్టుకున్న వ్యక్తి అయినా ఎవ్వరైనా వాళ్ల అంతిమ లక్ష్యం డబ్బు సంపాదించడం. లాభం వచ్చేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది. కానీ.. లాభాపేక్ష లేకుండా ఎవ్వరూ పని చేయరు. ఎందుకంటే.. దానికి ముందే చాలా పెట్టుబడి పెడతారు కాబట్టి కనీసం పెట్టుబడితో పాటు కాస్తో కూస్తో లాభం కూడా రావాలి కదా.
ప్రస్తుతం దేశమంతా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ టమాటా అని తెలుసు కదా. ప్రస్తుతం టమాటా ధర రూ.200 ఉంది. రెండు వందలకు పైనే ఉంది కొన్ని చోట్ల. పావుకిలో కొనాలన్నా రూ.50 అవుతుంది. ఒక్కో టమాటా కనీసం 15 రూపాయలు పడుతోంది. అంటే.. యాపిల్ కంటే కూడా కాస్ట్ లీ అయిపోయింది. అందుకే టమాటా ధర ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది. టమాటాను పండిస్తున్న రైతులంతా కోటీశ్వరులు అవుతున్నారు. కోట్లు వెనకేసుకుంటున్నారు. లాభాల మీద లాభాలు గడిస్తున్నారు. కానీ.. ఒక్క రైతు మాత్రం ఎలాంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకే టమాటాలు అందిస్తున్నాడు.కానీ… తమిళనాడుకు చెందిన రామన్, పుట్టస్వామి అనే ఇద్దరు రైతు సోదరులు తమ పొలంలో పండిన టమాటాను చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
Tomato Farmer : రూ.200 ధర అయినా కూడా రూ.80 కే అమ్ముతున్న రైతు సోదరులు
కిలో రూ.200 ఉన్నా కూడా కిలో రూ.80 కే అంటే సగం కంటే తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇప్పటికే తమ గ్రామంలో వెయ్యి కిలోల టమాటాలను అమ్మారు. ఎలాంటి లాభం ఆశించకుండా.. తమకు పెట్టుబడి కోసం అయిన ఖర్చు కోసమే రూ.80 కి కిలోలా అమ్మారు. చాలామంది బ్రోకర్లు, మధ్యవర్తులు ఎక్కువ లాభం ఇస్తాం.. అని చెప్పినా సామాన్యుల గురించి ఆలోచించి.. తక్కువ ధరకే టమాటాలను విక్రయించడంతో స్థానికులు ఆ రైతు సోదరులను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. నీలగిరి జిల్లాకు చెందిన ఈ రైతు సోదరులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.