Houses Land : మీకు ఖాళీ స్థలం లేదంటే ఇంటిపైన స్థలం ఉంటే నెల నెలకి డబ్బులే డబ్బులు..!
ప్రధానాంశాలు:
Houses Land : మీకు ఖాళీ స్థలం లేదంటే ఇంటిపైన స్థలం ఉంటే నెల నెలకి డబ్బులే డబ్బులు..!
Houses Land : ఈ రోజుల్లో మొబైల్ లేని ఇళ్లు లేదు.. సెల్‌ఫోన్ వాడని మనిషే లేడు అంటే అతిశయోక్తి కాదు… ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరి అయింది. స్కూల్‌కు వెళ్లే పిల్లోడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిపోయారు. మొబైల్ వాడకం ఎక్కువ కావడంతో సెల్‌ఫోన్స్ టవర్స్ కూడా ఎక్కువగా నిర్మించాల్సి వస్తోంది. 2024 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో మొబైల్ టవర్లు ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సంబంధిత శాఖలకు సూచించారు. ఈ నేపథ్యంలో మీరు స్థలంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయించుకుని నెలకు అద్దె రూపంలో డబ్బులు సంపాదించుకోండి. నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల సంపాదన రావాలంటే.. మీకు 500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.
Houses Land డబ్బులే డబ్బులు..
500 చదరపు అడుగుల స్థలం మీదే అనే పత్రం ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ప్రతి నెల కూడా మొబైల్ టవర్ కంపెనీ నుంచి మీకు డబ్బులు వచ్చేస్తాయి. మీ స్థలంలో టవర్ బిగించడం ద్వారా నెలకు వేలల్లో సంపాదించవచ్చు. ఈ నెలకు వచ్చే అమౌంట్ అనేది మీరు టవర్ కంపెనీలతో మాట్లాడుకునే దానిని బట్టి ఉంటుంది. బేర్ రూఫ్‌పై మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి 500 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉండగా, గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో అయితే.. 2 వేల నుంచి 2500 చదరపు అడుగుల ఖాళీ స్థలం అవసరం అవుతుంది. మరో విషయం ఏంటంటే.. మీరు ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో ఈ నిర్మాణం ఉండేలా చూసుకోవాలి.
మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం మీ భూమిని అద్దెకు ఇవ్వడానికి టీఎస్‌పీలను నేరుగా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో ఇండస్ టవర్, వియోమ్ రిట్ల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, అమెరికన్ టవర్ కార్పొరేషన్‌లను ఎంచుకోవచ్చు. గతంలో ఈ కార్పొరేషన్లు అనేక దేశాలలో టవర్ అభివృద్ధి కార్యక్రమాలకు బాధ్యత వహించాయి. ఇక ఇదిలా ఉంటే తాము మీ స్థలంలో టవర్ నిర్మిస్థామని ఏ కంపెనీ మీ ముందుకు రాదు. మనం వెళ్లి.. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాలి. వారిని సంప్రదించాలి. తర్వాత మీ ఇంటిపై కప్పును వారు పరిశీలిస్తారు. అప్పుడు అంతా ఓకే అనుకుంటేనే వారు ప్రతీ నెలా డబ్బులు చెల్లిస్తారు. ఇక టవర్ ఇన్ స్టాల్ అయిన తర్వాత మీ ప్రదేశం.. ఏ కంపెనీ టవర్ నిర్మించిందో దానిని బ్టటి.. మీకు నెలకు రూ.10 వేల నుంచి రూ.60 వేలు చెల్లిస్తారు.