Revantha Reddy Covid positive : బ్రేకింగ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా… ట్విట్టర్ వేదికగా వెల్లడి.. ఆందోళనలో కాంగ్రెస్ నేతలు…!
Revantha Reddy Covid positive : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
గత వారం రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రేవంత్ ఇటీవల మీటింగ్ ల పేరిట అనేక సమావేశాలకు హాజరు అయ్యారు. దీంతో ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కలవరం మొదలైంది.

tpcc cheif revantha reddy tested covid positive
ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసిన పలువు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే తమ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.