గిరిజనుల ఆదాయం పెంచాలి
Vizag : విశాఖపట్నం: గిరిజన రైతుల ఆదాయం పెంచేలా చూడాలని అందుకు తగిన మొక్కల పెంపకం, మరేఇతర అవకాశ మార్గాలను అన్వేనిషించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఉద్యన, పశుసంవర్థక శాఖల అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకం, గిరిజన మత్స్యకారులకు వలలు, బోట్లు సమకూర్చడానికి అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని మత్స్యశాఖ అధికారులను పీవో ఆదేశించారు.
అనంతగిరిలో మెట్టపాడు , జీలుగుపాడు, దబ్బపాడు గిరిజనులకు అవసరమైన మౌలిక సధుపాయాలు సమకూర్చాలని అందుకు తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను పీవో ఆదేశించారు. ఆయిల్ ఇంజన్లకోసం 270 మంది గిరిజనులు దరకాస్తు చేసుకోగా అందులో అర్హులందరికీ ఆయిల్ ఇంజన్లు అందేలా చూడాలన్నారు. కుట్టు మిషన్ శిక్షణ పొందే మహిళలకు శిక్షణ అనంతరం వారికి కుట్టు మషన్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంతో ఐటిడిఎ ఎపిఒ విఎస్. ప్రభాకరావు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.
మండలంలోని పలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఐటిడిఎ పిఒ సందర్శించారు. అనంతరం డోకులూరు పాఠశాలలో జరిగే నాడు- నేడు పనులు పరిశీలించారు. పాఠశాల చేస్తున్న పనులను అభినందించారు. అలాగే పాఠశాల ప్రహరీ గోడ నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం గొండెల్లి గ్రామంలో సచివాలయ భవన నిర్మణాన్మి పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేశాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు పాల్గాన్నారు.