TRS : అక్కడ కుస్తీ ఇక్కడ దోస్తీ..అందుకే టీఆర్ఎస్ ఓటమి.. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంచలన కామెంట్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : అక్కడ కుస్తీ ఇక్కడ దోస్తీ..అందుకే టీఆర్ఎస్ ఓటమి.. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంచలన కామెంట్స్..

 Authored By mallesh | The Telugu News | Updated on :10 December 2021,8:20 pm

TRS : స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారంటే..స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.

తాము ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలపడం సిగ్గుచేటని విమర్శించారు. ఇకపోతే కాంగ్రెస్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర్ మాటలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అస్సలు నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్‌లో చేరాలన్నారు.ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్యే క్రాంతి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఈ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో కుస్తీ పడుతూ, రాష్ట్రంలోని బీజేపీతో దోస్తీ చేస్తోందని విమర్శించారు.

Trs kranthi kiran chanti sensational comments on congress bjp

Trs kranthi kiran chanti sensational comments on congress bjp

TRS : కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.

కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.కాంగ్రెస్, బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందం వల్లే తాము ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని చెప్పారు. బీజేపీని నమ్ముకునే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, కాంగ్రెస్, బీజేపీలది అక్రమ సంబంధమని తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటనే ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది