YS Sharmila : షర్మిల ట్వీట్లపై దుమారం.. ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయిపోయిన షర్మిలక్క?
YS Sharmila : మనం ఒకరిని వేలెత్తి చూపించేముందు.. మన చేతికి ఉన్న మిగితా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయి. అంటే.. ఒకరిని అనే ముందు మనం సరిగ్గా ఉన్నామా? అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం సరిగ్గా లేకుండా… నిజాయితీగా లేకుండా.. రూల్స్ ఫాలో కాకుండా.. వేరే వాళ్లను విమర్శించే హక్కే లేదు. తాజాగా వైఎస్ షర్మిల చేసిన పని కూడా అదే. తను కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. ఆ సభ వల్ల చాలా కరోనా కేసులు పెరిగాయి. కనీసం కరోనా జాగ్రత్తలు కూడా పాటించలేదంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఆ సమయంలోనూ ఎవ్వరూ మాస్కులు ధరించలేదు. కరోనా జాగ్రత్తలేవీ పాటించకుండా… గుంపులు గుంపులుగా దగ్గర దగ్గర కూర్చున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నసమయంలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా… వైఎస్ షర్మిల దీక్ష అంటూ, పాదయాత్ర అంటూ హైదరాబాద్ లో చాలా అలజడి సృష్టించారు.
కట్ చేస్తే… వైఎస్ షర్మిల ఇటీవల కొన్ని ట్వీట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం నలుగురితో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే గ్లాస్ షీల్డ్ ను ఉపయోగించి కోవిడ్ నిబంధలను పాటిస్తూ రక్షణ చర్యలను తీసుకుంటున్నారు. లక్షల మంది పాల్గొనే ఎన్నికల్లో మనం ఈ నిబంధనలు ఎంతవరకు పాటించగలం. కాబట్టి ఈ నెల నిర్వహించే అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నాం. కోవిడ్ ఉధృత రూపం దాల్చుతున్న ఈ తరుణంలో ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం… అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
YS Sharmila : వైఎస్ షర్మిల ట్వీట్ పై టీఆర్ఎస్ నేతల ఫైర్?
ప్రజల ప్రాణాల గురించి మీరు మాట్లాడుతున్నారా షర్మిల? మీరు బహిరంగ సభలు నిర్వహించి.. వేల మందిని పిలిచినప్పుడు మీకు కరోనా గుర్తుకు రాలేదా? కరోనా ఉధృతంగా ఉన్నా కూడా పోలీసులు వద్దని చెప్పినా వినకుండా… ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు? అప్పుడు మీకు ఈ ప్రజలు గుర్తుకు రాలేదా? మీ సభకు రావడం వల్ల ఎంతమంది కరోనా బారిన పడ్డారో మీకు తెలియదా? అంటూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వైఎస్ షర్మిలను నిలదీస్తున్నారు.
కరోనా నిబంధనలు పాటించి ఉంటే.. షర్మిల ప్రధాన అనుచరుడు… బాలకృష్ణారెడ్డి కరోనాతో చనిపోయి ఉండేవారే కాదు… అంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. షర్మిల ఖమ్మం సభలోనూ కరోనా జాగ్రత్తలు పాటించలేదు.. మాస్క్ కూడా ధరించలేదు. చివరకు ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగ దీక్షలోనూ, పాదయాత్ర సమయంలోనూ, లోటస్ పాండ్ వద్ద కూడా కనీసం మాస్క్ పెట్టుకోలేదు.. అంటూ తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇటువంటి ట్వీట్ చేసి… అడ్డంగా బుక్కయిపోయారు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం నలుగురితో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే గ్లాస్ షీల్డ్ ను ఉపయోగించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రక్షణ చర్యలను తీసుకుంటున్నారు. లక్షల మంది పాల్గొనే ఎన్నికల్లో మనం ఈ నిబంధనలు ఎంతవరకు పాటించగలం.. 1/2 pic.twitter.com/GGAkaQJiGX
— YS Sharmila (@realyssharmila) April 23, 2021
కాబట్టి ఈనెల నిర్వహించే అన్ని ఎన్నికలను వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నాం.
కోవిడ్ ఉధృత రూపం దాలుస్తున్న ఈ తరుణంలో ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం. 2/2 pic.twitter.com/kZDKERBevO— YS Sharmila (@realyssharmila) April 23, 2021