Huzurabad bypoll : ఆ ఇద్దరు మంత్రులకు మూడింది.. హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యత పేరుతో వాళ్లకు చెక్ పెట్టడానికేనా?
Huzurabad bypoll : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తుండగా షెడ్యూలు ప్రకటనతో ప్రచారం మరింత ఉపందుకోనుంది. ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటనకు ముందే హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం విస్తృతం చేసింది. టీఆర్ఎస్వి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం మరింత పెంచింది. ఈటెలను ఢీ కొట్టేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ బాల్క సుమన్, తదితరులు విస్తృత పర్యటనలు చేపట్టారు.
Huzurabad bypoll : దుబ్బాక సీన్…
గెలుపు కోసం బీజేపీ తరపున బరిలో ఉన్న మాజీమంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించేందుకు మంత్రి హరీశ్ రావు బాధ్యతలు తీసుకోగా.. మరికొందరు టీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలు స్థానికంగా ఉంటూ గెల్లు గెలుపు కోసం పని చేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి మాజీమంత్రి ఈటల రాజేందర్ కావడంతో.. గులాబీ దళం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏ మాత్రం తేడా వచ్చిన గతేడాది ఇదే సమయంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అందుకే హుజూరాబాద్‌లో గెలుపు కోసం ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని టీఆర్ఎస్ గట్టిగా డిసైడయ్యింది. ఈ క్రమంలో పలువురు ముఖ్యనేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
Huzurabad bypoll : ఊస్టింగేనా..
ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లకు కూడా హుజూరాబాద్ సెగ్మెంట్లలోని పలు మండలాల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు మంత్రులకు హుజూరాబాద్ టెన్షన్ పట్టుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇతర టీఆర్ఎస్ నేతలు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో సక్సెస్ కాకపోతే అధినేత కేసీఆర్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది.
అదే మంత్రులు తమ బాధ్యతలను నిర్వహించే విషయంలో సక్సెస్ కాకపోతే వారి పదవులకే గండం ఏర్పడే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సమాచారం. ఒకవేళ మంత్రులు హుజూరాబాద్‌లో పార్టీకి మెరుగైన ఫలితాలు తీసుకురావడంలో విఫలమైతే.. అది వారి పదవిపైనే ప్రభావం చూపుతుందని పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం మంత్రులకు ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది.