Telangana 2023 CM పోలింగ్ పూర్తయిన గంటకే.. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది..
ప్రధానాంశాలు:
telangana 2023 CM పోలింగ్ పూర్తయిన గంటకే.. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది..
Who is the telangana 2023 CM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. అలా పోలింగ్ ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటికి వచ్చాయి. ఎలక్షన్ టైం లో ఎగ్జిట్ పోల్ రివిల్ చేయకూడదు కాబట్టి
Telangana 2023 CM తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. అలా పోలింగ్ ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటికి వచ్చాయి. ఎలక్షన్ టైం లో ఎగ్జిట్ పోల్ రివిల్ చేయకూడదు కాబట్టి ఏ మీడియా కూడా వాటిని రిలీజ్ చేయడం లేదు. కానీ కొంతమంది మాత్రం ఒపీనియన్ పోల్స్ అంటూ కొన్ని పోల్స్ లాగా పెట్టి ఎవరి గెలుపు సాధ్యం అనే దానిమీద ఎక్కువగా విడుదల చేశారు. బయటికి వచ్చిన అత్యధిక ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అంటూ చెప్పుకొస్తున్నాయి. సిఎన్ఎన్ న్యూస్ 18 లెక్కల ప్రకారం బీఆర్ఎస్ 48 సీట్లతో గెలవబోతోంది అంటూ, కాంగ్రెస్ పార్టీ 56 సీట్లు గెలవబోతుందని, బీజేపీ 10, ఎంఐఎం 5 సీట్లతో గెలవబోతుందని, కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు కనిపిస్తుందని ఈ సర్వే చెప్పుకొచ్చింది.
ప్రముఖ ఆరా సర్వే చెప్పిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కు 46 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 58 నుంచి 67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఇతరులకు 7 నుంచి 8 సీట్లు వస్తాయని చెబుతుంది. ఆరా సర్వే చాలా ఫేమస్ సర్వే. అయితే ఆరా సర్వే చెప్పిన దాని ప్రకారం 41.13% షేర్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి 39.5 శాతం షేర్ రాబోతుందని, బీజేపీకి10.7 శాతం షేర్ రాబోతుందని ఆరా సంస్థ తెలుపుతుంది. చాణక్య స్ట్రాటజీ అనే మరో సర్వే కాంగ్రెస్ పార్టీ 67 నుంచి 78 సీట్లతో గెలుస్తుందని, బిఆర్ఎస్ 22.32 స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే చెబుతుంది.
సర్వేలో ఎక్కువ శాతం తెలుగుదేశం సపోర్ట్ చేసే కాంగ్రెస్ క్ ఎక్కువ ఓట్లు ఉన్నాయని, వైసీపీ సపోర్ట్ చేసే బీఆర్ఎస్ కి ఓట్లు ఎక్కువగా లేవని కనిపిస్తుంది. ఇంకొన్ని సర్వేలు మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కే ఎక్కువ సీట్లు ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమస్ సంస్థ తెలిపిన దాని ప్రకారం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అని చెబుతున్నారు. లోకల్ చానల్స్ బీఆర్ఎస్ కి సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని పలు సర్వేలు చెబుతున్నాయి డిసెంబర్ 3న ఫలితాలు వెలువబడుతాయి అప్పటిదాకా ఎవరు గెలుస్తారు అనేది మాత్రం పూర్తిగా చెప్పలేం.