KCR : భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన వెంటనే కేసీఆర్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఇదే…!
KCR : ఇవాళ దసరా పండుగ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను పెట్టబోతున్న జాతీయ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు బలపర్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా..
ఈ సమావేశంలో 283 మంది టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అయితే పార్టీ జెండా మాత్రం ఇదివరకు ఉన్న జెండా రంగులోనే ఉంటుంది. అంతా పాత జెండానే ఉంటుంది. అయితే.. పార్టీ గుర్తు ఏది ఉంటుందో మాత్రం తెలియదు. టీఆర్ఎస్ పార్టీకే ఉన్న కారు గుర్తును ఉంచేలా ఎన్నికల కమిషన్ కు కేసీఆర్ రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితి పేరును పెట్టడానికి కారణం.. నార్త్ ఇండియాను టార్గెట్ చేయడం. నిజానికి టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. 2001 లో ఈ పార్టీని ప్రాంతీయ పార్టీ గానే పేర్కొన్నారు.
KCR : నార్త్ ఇండియాను టార్గెట్ చేసేందుకే బీఆర్ఎస్ గా మార్చారా?
కానీ.. ఇప్పుడు పేరు మార్చడమే కాదు.. పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ రిక్వెస్ట్ పెట్టనుంది. అలాగే.. బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వం కూడా పెంచాలని టీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో సభ్యత్వాలను పెంచాలని టీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు వస్తాయని, పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జులుగా పనిచేసే అవకాశం కూడా ఉంటుందని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.