TRS : ఆ సర్వే రిజల్ట్స్ తెలిసి టీఆర్ఎస్ నేతల కళ్లు బైర్లు కమ్మాయట? ఆ రిపోర్ట్ చూసి హైకమాండ్ షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : ఆ సర్వే రిజల్ట్స్ తెలిసి టీఆర్ఎస్ నేతల కళ్లు బైర్లు కమ్మాయట? ఆ రిపోర్ట్ చూసి హైకమాండ్ షాక్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 April 2021,10:41 am

TRS : ప్రస్తుతం తెలంగాణలో పురపాలక ఎన్నికల సమరం మొదలైంది. మొన్ననే నాగార్జునసాగర్ ఎన్నికలు ముగిశాయి. అంతలోనే మరో ఎన్నికలకు తెర లేపింది ఎన్నికల సంఘం. మునిసిపల్ ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో… ప్రధాన పార్టీలన్నీ మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓవైపు కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే మరోవైపు ప్రజల్లో మమేకం అవుతున్నాయి. రెండు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లకు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. అన్నింటికన్నా ఎక్కువగా గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయట. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా గ్రేటర్ వరంగల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

trs party servey in greater warangal municipal elections

trs party servey in greater warangal municipal elections

అయితే.. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అంచనాలు తారుమారు అవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పక్కా రిపోర్ట్ రావడంతో.. పార్టీలో టెన్షన్ మొదలైందట. పార్టీ నేతలే కాదు.. హైకమాండ్ కూడా ఈ విషయంలో కాస్త టెన్షన్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నా… టీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు.

TRS : టీఆర్ఎస్ రెబల్స్ తో పార్టీకి పెద్ద దెబ్బ

అయితే.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్లు ఆశించిన టీఆర్ఎస్ నాయకులు.. వాళ్లలో కొందరికి టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్ గా మారారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో… రెబల్స్ గా మారి.. పోటీ చేసి.. గెలిచి తమ సత్తా చాటుతామని టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. రెబల్స్ విషయంలో స్వతంత్ర అభ్యర్థుల విషయంలో గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయట. అందుకే… టీఆర్ఎస్ పార్టీ సీక్రెట్ గా గ్రేటర్ వరంగల్ లో సర్వే చేయిస్తోందట. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందనే దానిపై పార్టీ సర్వే చేయిస్తే అందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయట.

అధికార పార్టీకి వేరే పార్టీ అభ్యర్థులతో గట్టి పోటీ ఏర్పడుతోందట. ముఖ్యంగా ఒక 40 డివిజన్లలో అయితే.. అధికార పార్టీకి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి కావడంతో అధికార పార్టీ కాస్త టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో ఎక్కువగా రెబల్స్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులతోనే ఎక్కవగా పోటీ వస్తోందట. అందుకే… దానికి వెంటనే తగు చర్యలు తీసుకొని.. ప్రచారాన్ని ముమ్మరం చేసి.. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా హైకమాండ్ ప్రణాళికలు రచిస్తోందట. చూడాలి మరి.. గ్రేటర్ వరంగల్ ఎన్నికలను అధికార పార్టీ ఎలా ఎదుర్కుంటుందో?

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది