TRS : టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరుతున్న సీనియర్ నేత? ఆయన పోతే బీజేపీకి క్యూనే ఇక? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరుతున్న సీనియర్ నేత? ఆయన పోతే బీజేపీకి క్యూనే ఇక?

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 February 2021,10:47 am

TRS పార్టీకి మళ్లీ గడ్డు పరిస్థితులు తయారయ్యాయి. ఇప్పటికే పార్టీకి తెలంగాణలో తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సీనియర్ నేతలు బీజేపీ బాట పట్టడానికి సిద్ధం అవుతున్నారు అంటే.. పార్టీ పరిస్థితి త్వరలోనే అగమ్యగోచరంగా మారనుంది.

trs senior leader ponguleti srinivas reddy to join in bjp soon

trs senior leader ponguleti srinivas reddy to join in bjp soon

టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలు కూడా సీనియర్ నేతలు కావడం.. అధిష్ఠానంతో మంచి సంబంధాలు ఉన్న నేతలు కావడంతో.. ఒక్క సీనియర్ నేత బయటకు వెళ్లినా.. ఆయన అనుచరులు, ఆయన సన్నిహితులు, ఇత నేతలు కూడా వేరే పార్టీని చూసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

త్వరలో బీజేపీలో చేరనున్న TRS సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి?

అయితే.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవడానికి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

నిజానికి.. టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం పొంగులేటికి అంతగా ప్రాధాన్యత లేదు. అధిష్ఠానం పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నప్పటికీ.. ఆయనకు కీలక పదవులైతే ఏవీ ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. దానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

కనీసం ఎమ్మెల్సీ అయినా తనకు దక్కుతుందని పొంగులేటి భావించారు కానీ.. అది కూడా దక్కేలా లేదని.. అందుకే పార్టీ మారాలని పొంగులేటి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరితే ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారట.

ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పొంగులేటి భేటీ అయి.. పార్టీలో చేరడం గురించి చర్చించారట. అయితే.. పొంగులేటి నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. పొంగులేటి ఒకవేళ బీజేపీలో చేరితే మాత్రం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన దెబ్బ పడనుంది. ఆయనతో పాటు చాలామంది నేతలు బీజేపీకి క్యూ కట్టనున్నారు. చూద్దాం మరి.. పొంగులేటి నిజంగా పార్టీ మారుతారా? లేదా? అని. దాని తీవ్రత టీఆర్ఎస్ పై ఉంటుందా? దానికి దిద్దుబాటు చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది