Viral Video : నది దాటుతుండగా.. కుప్పకూలిన బ్రిడ్జ్.. ట్రక్ ఎలా కొట్టుకుపోయిందో చూడండి..!
Viral Video : దేనితోనైనా పెట్టుకోవచ్చు కానీ.. నీటితో పెట్టుకోవద్దు. అవును.. నీళ్లు చాలా డేంజర్. చిన్న వరద కూడా మనల్ని ముంచేయగలదు. పెద్ద పెద్ద వరదలు వస్తే ఇక అన్నీ కొట్టుకుపోవాల్సిందే. అందుకే నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. మామూలుగా రోడ్డు మీద చిన్న వరదలాంటిది వెళ్తేనే.. దాన్ని దాటాలంటే భయపడతాం. బైక్ లు అయితే ఆ వరద ఉదృతిని తట్టుకోలేక కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయిన చాలా వీడియోలను మనం చూశాం. అందుకే.. నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వంతెన పైనుంచి దాటుతున్న ట్రక్ కు సంబంధించిన వీడియో అది. అప్పటికే ఆ బ్రిడ్జ్ దెబ్బతిన్నది. సగం విరిగిపోయింది. ఆ విషయాన్ని గమనించని.. ట్రక్ డ్రైవర్.. ట్రక్ ను అలాగే.. ఆ వంతెన పైనుంచి పోనిచ్చాడు. ట్రక్ వంతెన మధ్యలోకి రాగానే.. వంతెన మొత్తం కుప్పకూలిపోయింది. దీంతో ట్రక్ తో పాటు.. ట్రక్ డ్రైవర్ కూడా నదిలో పడి కొట్టుకుపోయారు. ఆ వంతెన కింద ఉన్న నది ఆ సమయంలో ఉదృతంగా ప్రవహిస్తుండటంతో.. ట్రక్ వెంటనే నదిలో మునిగిపోయింది.
Viral Video : చెక్క వంతెన కావడంతో ప్రమాదం
నిజానికి అది చెక్కతో చేసిన వంతెన. ఇదివరకే అక్కడ నిర్మించిన కాంక్రీట్ వంతెన వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ఆ వంతెన ప్లేస్ లో చెక్కతో వంతెనను తయారు చేశారు. అయితే.. మళ్లీ వరదలు రావడంతో చెక్క వంతెన కూడా దెబ్బతిన్నది. అసలు.. ఆ వంతెన దాటాలంటేనే అక్కడి స్థానికులు భయపడిపోతున్నారు. ఈ విషయం తెలియని ఆ ట్రక్ డ్రైవర్.. తొందరపడి.. ఆ వంతెన మీది నుంచి ట్రక్ ను నడపడంతో ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనను అక్కడున్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటు చేసుకుంది.
ట్రక్ నదిలో పడిపోగానే.. ట్రక్ డ్రైవర్ వెంటనే నదిలో దూకేసి ప్రాణాలను కాపాడుకున్నాడు. నదిలో ట్రక్ కొట్టుకుపోవడమే కాదు.. ఆ వంతెన మొత్తం విరిగిపోయి నదిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడి స్థానికులు ఆ నదిని దాటాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది.
Russie : Un pont suspendu près du village d’Uryum, à l’est de Chita, s’est effondré lorsqu’un camion a tenté de le traverser. Le conducteur a survécu. Des dizaines de villages sont inondés dans cette zone de la région transbaïkal pic.twitter.com/j5qFQRP7Jc
— Rebecca Rambar (@RebeccaRambar) July 23, 2021