Atukula Murukulu : అటుకులతో మురుకులు ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తాయి…
Atukula Murukulu : పిల్లల కోసం మనం ఎన్నో రకాల పిండి వంటలను చేసి పెడుతూ ఉంటాం.. కానీ పిల్లలు మాత్రం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంటారు.. ఎన్ని వెరైటీలు చేసిన వాళ్లకి అవి బోర్ గానే అనిపిస్తూ ఉంటాయి.. అలాంటి వెరైటీలలో ఇప్పుడు కొత్తగా అటుకులతో మురుకులు ఎంతో సింపుల్గా ఇలా చేసి పిల్లలకి పెట్టండి.. ఇక ఇవి ఒక్కసారి తిన్నారంటే వాళ్లు అస్సలు వదలరు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.. కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, అటుకులు, పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర ,కొంచెం నువ్వులు, బ్లాక్ సీడ్స్, ఉప్పు, మిరియాల పొడి, వాటర్, ఆయిల్, బటర్, కరివేపాకు మొదలైనవి…
తయారీ విధానం : దీనికోసం ముందుగా ఒక పెద్ద కప్పు అటుకులను ఒక కడాయిలోకి తీసుకొని దానిలోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పును వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఈ అటుకులు, పుట్నాల పప్పు చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసుకుని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని దాన్లో ముందుగా చేసి పెట్టుకున్న అటుకుల పిండిని దాన్లో వేసి తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, కొంచెం బ్లాక్ సీడ్స్, మిర్యాల పొడి, ఉప్పు, ఒక స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాగా మసలు పెట్టిన నీటిని వేసి సాఫ్ట్ గా చపాతి పిండిలా కలుపుకోవాలి.
తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి అవ్వనివ్వాలి. తర్వాత ఆ పిండిని మురుకుల గొట్టంలో పెట్టి మురుకుల్లా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న మురుకులని బాగా ఫ్రై అవ్వనివిచ్చి తీసుకోనీ దానిలో వేయించిన కరివేపాకు ను కూడా వేసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా అటుకుల మురుకులు రెడీ.. ఇది పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి.