Chicken Fry : చికెన్ లవర్స్ కోసం నాలుగు రకాల చికెన్ ఫ్రైలు ఈ విధంగా ట్రై చేయండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Fry : చికెన్ లవర్స్ కోసం నాలుగు రకాల చికెన్ ఫ్రైలు ఈ విధంగా ట్రై చేయండి…

Chicken Fry : చికెన్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూనే ఉంటారు. ఇలా చికెన్ ఇష్టపడే వారి కోసం నాలుగు రకాల చికెన్ వేపుడులను తయారు చేసుకుందాం. నాలుగు చికెన్ వేపుడు కావాల్సిన పదార్థాలు : చికెన్, టమాటాలు పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి. 1వ చికెన్ వేపుడు : ముందుగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 September 2022,6:00 am

Chicken Fry : చికెన్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూనే ఉంటారు. ఇలా చికెన్ ఇష్టపడే వారి కోసం నాలుగు రకాల చికెన్ వేపుడులను తయారు చేసుకుందాం. నాలుగు చికెన్ వేపుడు కావాల్సిన పదార్థాలు : చికెన్, టమాటాలు పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, జాపత్రి, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి.

1వ చికెన్ వేపుడు : ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని రెండు స్పూన్ల కారం, కొంచెం ఉప్పు, కలిపి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి దాన్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో నాలుగు పచ్చిమిర్చి ముక్కలను వేసి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత దాంట్లోకి ఒక ఆరకప్పు ఉల్లిపాయలు ,అరకప్పు టమాటా ముక్కలు వేసి రెండు మూడు నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. తరువాత కలిపి దానిలోకి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత దానిలో కొత్తిమీర చల్లి దింపుకోవాలి అంతే.

Try these four types of Chicken Fry for chicken lovers

Try these four types of Chicken Fry for chicken lovers

2 వ చికెన్ వేపుడు : ముందుగా చికెన్ ని తీసుకొని ఒక స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో చికెన్ వేసి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారం వేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఇంకొకపక్క ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూను మిరియాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, సన్నగా చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి. పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సీ జార్లో ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటాలు, వేసి మెత్తటి పేస్టులా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ చికెన్ మిశ్రమంలో ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. 78 నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని కూడా దీంట్లో వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక పది నిమిషాల తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే.

3వ చికెన్ వేపుడు పెప్పర్ చికెన్ ఫ్రై : ముందుగా చికెన్ ని తీసుకుని దాంట్లో ఉప్పు ,పసుపు ,కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం జాపత్రి, కొంచెం మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు వేసి దోరగా వేయించుకొని పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి చీలికలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో వేసి కలుపుకోవాలి. ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే అంతే.

4వ చిట్టి నాడు చికెన్ వేపుడు : ముందుగా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా వేగిన తర్వాత చికెన్ వేసి దానిలో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇక దానిపై మూత పెట్టి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇంకొకపక్క ఒక కడాయి పెట్టి ఒక అనాసపువ్వు, ఒక దాల్చిన చెక్క, మూడు యాలకులు, జాపత్రి ,మిరియాలు ,లవంగాలు, సోంపు, జిలకర సాజీర 7, 8 మిరపకాయలు, నాలుగైదు స్పూన్లు ధనియాలు, వేసి మంచిగా వేయించుకొని పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని దాంట్లో వేసి బాగా పది నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇక లాస్ట్ లో కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. అంతే చెట్టినాడు చికెన్ వేపుడు రెడీ.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది