Chicken Fry : మ్యారినేట్ చేసే పని లేకుండా తక్కువ నూనెతో ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Fry : మ్యారినేట్ చేసే పని లేకుండా తక్కువ నూనెతో ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై…!

Chicken Fry  : ఈరోజు సింపుల్ చికెన్ ఫ్రై ని ఎలా చేయాలో చూద్దాం.. బ్యాచులర్స్ చాలా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి మ్యారినేషన్ లేకుండా మసాలా పౌడర్ బయట నుంచి కొని తీసుకురానవసరం లేదన్నమాట. అన్ని కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ ఫ్రై ని ఈజీగా చేసేయచ్చు. సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా.. దీనికి కావాల్సిన పదార్థాలు: […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Chicken Fry : మ్యారినేట్ చేసే పని లేకుండా తక్కువ నూనెతో ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై...!

Chicken Fry  : ఈరోజు సింపుల్ చికెన్ ఫ్రై ని ఎలా చేయాలో చూద్దాం.. బ్యాచులర్స్ చాలా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి మ్యారినేషన్ లేకుండా మసాలా పౌడర్ బయట నుంచి కొని తీసుకురానవసరం లేదన్నమాట. అన్ని కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ ఫ్రై ని ఈజీగా చేసేయచ్చు. సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..
దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, సాజీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, పెరుగు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి… తయారీ విధానం; ఫస్ట్ మనం దీనికి చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో రెండు ఇంచుల దాల్చిన చెక్క, ఐదారు లవంగం మొగ్గలు, నాలుగు యాలుకలు ఒక టీ స్పూన్ దాకా మిరియాలు అలాగే కారానికి తగినట్టుగా 10 నుండి 12 దాకా ఎండు మిరపకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి.

తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కొద్దిసేపు ట్రై చేయండి. వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి వీటిని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫైన్ పౌడర్ల గ్రైండ్ చేసుకోవాలి. కదా ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కదండీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా రెండు బిర్యానీ ఆకులు వేసుకుని కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయల్ని వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చక్కగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న కేజీ చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంత మిక్స్ చేసుకొని ఇందులోకి అరకప్పు దాకా పెరుగును వేసుకోవాలి.

చికెన్ ని బాగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చి డ్రై అయ్యేంతవరకు కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ దగ్గరికి ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. వాటర్ ఇంకి కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు డ్రై గా ఫ్రై అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది చక్కగా డ్రై గా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్ గా కొద్దిగా పుదీనా అలాగే కరివేపాకు వేసి అంతా మిక్స్ చేసుకొని పక్కకు దించుకోండి. ఇలా లాస్ట్ లో పుదీనా కరివేపాకు వేయడం వల్ల చికెన్ కి ప్లేవర్స్ బాగా పట్టి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ.. చాలా బాగుంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది