KTR : నెల రోజుల్లో వచ్చి పట్టాలు ఇస్తా, ఎన్ని ఇబ్బందులున్నా ఆగేది లేదు.. కేటిఆర్
KTR : జవహర్ నగర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని… అయినా సరే తాము ఎక్కడా తగ్గడం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆ తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించింది అని ఈ సందర్భంగా కేటిఆర్ మండిపడ్డారు. జవహర్ నగర్ ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి 58..,59 ద్వారా పట్టాలు ఇప్పిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.
నెల రోజుల్లో 58.. 59 జీవో లు తీసుకొస్తామన్న మంత్రి… డంప్ యార్డ్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 147కోట్ల రూపాయల తో క్యాపింగ్ చేసామన్నారు. వచ్చే మురుగు శుధ్ధికోసం 250 కోట్లు కేటాయించామని వివరించారు. 24 మెగా వాట్ల విద్యుత్తు ప్లాంట్ వచ్చింది… మరోటి కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు.ఒక్క మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంచినీటి సరఫరా చెయ్యడానికి 240కోట్ల రూపాయల తో ఖర్చు చేస్తున్నామని వివరించారు.
50వేల కనెక్షన్లను కేవలం రూపాయికే ఇస్తున్నాం అన్నారు. 308 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి లో అనేక పనులు చేస్తున్నామన్నారు. కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని… అయినా అభివృద్ధి పనులు చేపడుతాం అన్నారు నెల రోజుల్లో పట్టాలు ఇచ్చేందుకు ఇక్కడికి వస్తానని స్పష్టం చేసారు.