Tulsi Root | తులసి వేరు కషాయం ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..ఈ విషయం మీకు తెలుసా?
Tulsi Root | తులసి మొక్క గురించి మనందరికీ పరిచయం ఉన్నదే. ఇది ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా కనిపిస్తుంది. మతపరమైన ప్రాధాన్యతతో పాటు, తులసికి ఉన్న ఔషధ గుణాలు కూడా దీనికి అంతగా ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. తులసి వేర్లు కూడా ఔషధ గుణాలతో నిండి ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. తులసి వేర్లతో తయారైన కషాయాన్ని వినియోగించడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

#image_title
తులసి వేరు కషాయం లాభాలు:
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:
తులసి వేర్లలోని సహజ సేంద్రియ రసాయనాలు శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం:
జలుబు, దగ్గు, జ్వరం, సైనస్ వంటి శ్వాసకోశ వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియకు సహాయం:
తులసి వేరు కషాయం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది:
తులసి వేర్ల కషాయాన్ని తీసుకుంటే నరాల శాంతి కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మూడ్‌ను కూడా బూస్ట్ చేస్తుంది.
శరీరాన్ని శుద్ధి చేస్తుంది:
తులసి వేర్ల కషాయం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తీసే గుణాన్ని కలిగి ఉంది. ఇది ఒక సహజ డిటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది.