రేవంత్ కొత్త పార్టీ.. ఈటెలకు టచ్ లో ఇద్ద‌రు మంత్రులు… త్వరలో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

Etela Rajendar : తెలంగాణ రాజకీయాల్లో రాబోయే ఆరు నెలల్లో అతి పెద్ద ప్రకంపనలు ఏర్పడబోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ నుండి బలవంతంగా గెంటివేయబడ్డ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవితవ్యం రాష్ట్రంలో కొత్త సమీకరణలకు తెర తీస్తుందని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ లో ఈటెలకు మంచి పట్టు ఉన్న విషయం తెల్సిందే. ఆయన పట్టు కారణంగానే బయటకు పంపిచారనేది కొందరి వాదన. ఆ విషయం పక్కన పెడితే త్వరలోనే ఆయన టీఆర్‌ఎస్ కు పూర్తిగా గుడ్ బై చెప్పి కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని రాజకీయ శక్తులను కూడగట్టుకుని ఈటెల రాజేందర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈటెలతో మంత్రులు టచ్‌లో..

ఈటెల రాజేందర్‌ Etela Rajendar తో ఏ ఒక్క మంత్రి కాని ఎమ్మెల్యే కాని చర్చించినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినా కూడా ఇద్దరు మంత్రులు ఈటెల రాజేందర్‌ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. నీకు జరిగిన అన్యాయం పై పోరాటం చేస్తామంటూ వారు హామీ ఇచ్చారట. దీంతో పాటు ఈటెల రాజీయ భవిష్యత్తుకు తాము మద్దతుగా ఉంటామని వారు అన్నారట. సీఎం కేసీఆర్‌ ఈ విషయం ఇంటిలిజెన్స్ ద్వారా తెలిసిందని సమాచారం అందుతోంది. ఆ మంత్రులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతారా లేదంటే హెచ్చరించి బయటకు పంపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Two Minister Touch to Etela Rajendar

కాంగ్రెస్‌ నుండి కొందరు…

ఈటెల రాజేందర్‌ టీఆర్‌ఎస్ ను వీడి కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని, ఆ పార్టీలో రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంకా కొందరు టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ నుండి ఒకరు ఇద్దరు నాయకులు జాయిన్‌ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి ఈటెలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంటున్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో కీలక రాజకీయ పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. టీఆర్‌ఎస్ నుండి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా ఈటెలకు మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

7 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

8 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

10 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

12 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

14 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

16 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

17 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

18 hours ago