Boyfriend : రోడ్డు మీద ప్రియుడి కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు.. చివరికి పోలీసులు ఏం చేశారంటే ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Boyfriend : రోడ్డు మీద ప్రియుడి కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు.. చివరికి పోలీసులు ఏం చేశారంటే ..??

Boyfriend : ఈ ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెతో శారీరకంగా కలిశాడు. కొన్నాళ్ల తర్వాత ఫక్రుద్దీన్ మరో ఆసుపత్రికి మారాడు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 October 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  రోడ్డు మీద ప్రియుడి కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు..

  •  చివరికి పోలీసులు ఏం చేశారంటే

  •  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది

Boyfriend : ఈ ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెతో శారీరకంగా కలిశాడు. కొన్నాళ్ల తర్వాత ఫక్రుద్దీన్ మరో ఆసుపత్రికి మారాడు. అక్కడ మరో యువతిని పరిచయం చేసుకొని ఇదే రకంగా ఆమెతో ప్రవర్తించాడు. అయితే ఓ రోజు ఎవరికీ చెప్పకుండా తన సొంత గ్రామానికి వెళ్ళాడు.

అక్కడ తన ఇంటి పక్కన మరో యువతీతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే అతడి నిశ్చితార్థ సమయానికి కరెక్ట్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతని విషయం మొత్తం చెప్పేశారు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే ఆ యువకుడి చేతిలో మోసపోయిన ఇద్దరు యువతులు మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద గొడవ పడ సాగారు. అరెస్ట్ అయినా యువకుడు తనకంటే తనకు కావాలని ఇద్దరు యువతులు పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. వీరు గొడవ చూసి పోలీసులు అయోమయానికి గురయ్యారు. చివరికి చేసేదేమీ లేక ఫక్రుద్దీన్ ను రిమాండ్ కు తరలించారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సాధారణంగా ఒక యువకుడు మోసం చేస్తే అతడి మీద పగ పెంచుకుంటారు లేదంటే అతడిని కటకటాల్లోకి నెట్టేస్తారు. కానీ ఇక్కడ మోసపోయిన ఇద్దరు యువతులు అతడి కోసం దెబ్బలాడుకుంటున్నారు. తనకంటే తనకు కావాలని జుట్టు పట్టుకొని మరి కొట్టుకుంటున్నారు. మోసం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించి కటకటాలోకి నెట్టేయాల్సింది పోయి ఇద్దరి యువతులను మోసం చేసిన యువకుడి కోసం కొట్టుకోవడం చాలా వింతగా అనిపించింది. పోలీసులు కూడా వీళ్ళ గొడవ చూసి ఏం చేయాలో అయోమయంలో పడిపోయారు. చివరికి చేసేదేం లేక ఆ యువకుడిని రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది