
Two women fight on road for her boyfriend
Boyfriend : ఈ ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెతో శారీరకంగా కలిశాడు. కొన్నాళ్ల తర్వాత ఫక్రుద్దీన్ మరో ఆసుపత్రికి మారాడు. అక్కడ మరో యువతిని పరిచయం చేసుకొని ఇదే రకంగా ఆమెతో ప్రవర్తించాడు. అయితే ఓ రోజు ఎవరికీ చెప్పకుండా తన సొంత గ్రామానికి వెళ్ళాడు.
అక్కడ తన ఇంటి పక్కన మరో యువతీతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే అతడి నిశ్చితార్థ సమయానికి కరెక్ట్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతని విషయం మొత్తం చెప్పేశారు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్ కి తీసుకొచ్చారు. అయితే ఆ యువకుడి చేతిలో మోసపోయిన ఇద్దరు యువతులు మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద గొడవ పడ సాగారు. అరెస్ట్ అయినా యువకుడు తనకంటే తనకు కావాలని ఇద్దరు యువతులు పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. వీరు గొడవ చూసి పోలీసులు అయోమయానికి గురయ్యారు. చివరికి చేసేదేమీ లేక ఫక్రుద్దీన్ ను రిమాండ్ కు తరలించారు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సాధారణంగా ఒక యువకుడు మోసం చేస్తే అతడి మీద పగ పెంచుకుంటారు లేదంటే అతడిని కటకటాల్లోకి నెట్టేస్తారు. కానీ ఇక్కడ మోసపోయిన ఇద్దరు యువతులు అతడి కోసం దెబ్బలాడుకుంటున్నారు. తనకంటే తనకు కావాలని జుట్టు పట్టుకొని మరి కొట్టుకుంటున్నారు. మోసం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించి కటకటాలోకి నెట్టేయాల్సింది పోయి ఇద్దరి యువతులను మోసం చేసిన యువకుడి కోసం కొట్టుకోవడం చాలా వింతగా అనిపించింది. పోలీసులు కూడా వీళ్ళ గొడవ చూసి ఏం చేయాలో అయోమయంలో పడిపోయారు. చివరికి చేసేదేం లేక ఆ యువకుడిని రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.