Udyogini Scheme : కేంద్ర ప్రభుత్వం నుండి 0 వడ్డీకి 3 లక్షల లోన్ ..లక్ష యాభై వేలు సబ్సిడీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Udyogini Scheme : కేంద్ర ప్రభుత్వం నుండి 0 వడ్డీకి 3 లక్షల లోన్ ..లక్ష యాభై వేలు సబ్సిడీ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 May 2023,6:00 pm

ఈ స్కీమ్ పేరు ఉద్యోగిని స్కీం. దీనిని కేంద్ర ప్రభుత్వం 2020లో మహిళల కోసం మొదలుపెట్టింది. సొంత వ్యాపారం చేయడానికి లేదా వ్యాపారం అభివృద్ధి చేయలనుకునే మహిళలకు ఇది వర్తిస్తుంది. కచ్చితంగా భవిష్యత్తులో బిజినెస్ సక్సెస్ అవుతుంది అనుకుంటే వాళ్లకు కచ్చితంగా ఈ లోన్ ఇస్తారు. ఆల్రెడీ బిజినెస్ ఉండి దానిని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే దానికి మంచిగా లాభాలు వస్తాయనుకుంటే దానికి లోన్ తప్పకుండా ఇస్తారు. ఈ విధంగా పథకం లోన్ వర్క్ అవుట్ అవుతుంది. గరిష్టంగా మూడు లక్షలు ఇస్తారు. అయితే బిజినెస్ అనేది మూడు లక్షల కంటే తక్కువ గా స్టార్ట్ చేయాలి.

అంతకుమించి ఎక్కువ బడ్జెట్ అంటే ఈ లోన్ అందదు. అయితే వడ్డీ సున్నా. కాకపోతే అది కేవలం ఎస్సీ, ఎస్టీ, అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే. మిగతా వాళ్ళు వడ్డీ కట్టాలి. అలాగే 30% సబ్సిడీలు వితంతువులకు, అంగవైకల్యం ఉన్నవాళ్లకు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 50% సబ్సిడీ లభిస్తుంది. వార్షికాదాయం రెండు లక్షల కన్నా తక్కువ ఉంటే 50% సబ్సిడీ వస్తుంది. ఎటువంటి హామీ పెట్టాల్సిన పనిలేదు. టెన్యూర్ 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాంకు కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

Udyogini Scheme Details In Telugu Complete Details About Udyogini Scheme

Udyogini Scheme Details In Telugu – Complete Details About Udyogini Scheme

బ్యాంకు లోన్ ఇచ్చినందుకు తగిన చార్జీలు వేస్తారు. ఈ లోన్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. 25 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలకు ఇది వర్తిస్తుంది. అలాగే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండాలి. ఈ లోన్ కి అప్లై చేసినవాళ్లు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తీసుకుంటేనే లోన్ అందిస్తారు. ఇవన్నీ అర్హతలు ఉంటేనే బ్యాంకు లోన్ వస్తుంది. ఈ పథకానికి అప్లై చేయడానికి రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అలాగే బ్యాంక్ పాస్ బుక్ చూపించాలి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది