Udyogini Scheme : ఉద్యోగిని పథకం ద్వారా మహిళలకు కేంద్రం శుభవార్త… వడ్డీ లేకుండా రుణాలు…!
ప్రధానాంశాలు:
Udyogini Scheme : ఉద్యోగిని పథకం ద్వారా మహిళలకు కేంద్రం శుభవార్త... వడ్డీ లేకుండా రుణాలు...!
Udyogini Scheme : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అనేక రకాల పథకాలు ద్వారా ఆర్థిక సాయం అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారులకు సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం ద్వారా మహిళలకు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని, తద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి సాధిస్తారనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఈ పథకం ద్వారా కేంద్రం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఉచితంగా అయితే ఇవ్వడం లేదు. వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. అంటే ఈ పథకం ద్వారా పొందిన డబ్బును వ్యాపారానికి వాడుకుని తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Udyogini Scheme : ఉద్యోగిని పథకం…
ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం. ఇక ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళా రైతులు సైతం బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయితే ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను పొందడంతో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందవచ్చు. ఇక ఈ పథకం నుండి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్రం అందిస్తుంది.
Udyogini Scheme : అర్హులు…
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉద్యోగిని పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను పొందాలంటే కచ్చితంగా వారు 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆర్థిక ఆదాయాన్ని కలిగి ఉండాలి. ఇక భర్త లేని మహిళలకు దివ్యంగులైన వారికి ఆదాయంలో పరిమితులు ఉండదు. ఈ పథకంలో రుణాలు పొందేందుకు SC,ST మహిళలకు ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు కచ్చితంగా 18 నుండి 55 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు పొందాలంటే మహిళలు ఇదివరకు బ్యాంకులో తీసుకున్న రుణాలు సమర్థవంతంగా పూర్తి చేసి ఉండాలి.
Udyogini Scheme : కావాల్సిన పత్రాలు…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు పొందాలంటే కచ్చితంగా ఈ పత్రాలు సమస్యించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
జన్మ ధ్రువీకరణ పత్రం
చిరునామా ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం
రేషన్ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం
బ్యాంక్ పాస్ బుక్
బీపీఎల్ కార్డు..
వీటితోపాటు బ్యాంకు వారు ఇతర పత్రాలను కోరితే వాటిని కూడా సమర్పించాలి.
దరఖాస్తు…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగిని పథకం కి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ సమీప ప్రాంతంలో గల బ్యాంకుకు వెళ్లి ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులోనే ఈ పథకానికి సంబంధించి ఒక ఫామ్ ఇస్తారు. దానిని పూర్తి చేసి బ్యాంక్ వారికి తిరిగి ఇవ్వాలి. మీ వివరాలను పరిశీలించిన అనంతరం బ్యాంకు వారు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాని ఆన్లైన్ ద్వారా చేసే కంటే డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్లి చేయడం ద్వారా త్వరగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి.