Undavalli Sridevi : వైసీపీనీ కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న ఉండవల్లి శ్రీదేవి.. పవన్ కళ్యాణ్ తో సరికొత్త ఎత్తుగడ..?

Advertisement

Undavalli Sridevi : ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడటం కారణంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో కాకుండా హైదరాబాదులో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తనని సస్పెండ్ చేయడం పట్ల వైసీపీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మీడియా సమావేశం నిర్వహించి యూరప్ లో తాను డాక్టర్ చదువుతూ.. మంచి జీవితాన్ని జీవిస్తున్న సమయంలో ఫోన్ చేసి మరి రాజకీయాల్లోకి రమ్మన్నారు.

Undavalli Sridevi new political with Janasena chief Pawan Kalyan
Undavalli Sridevi new political with Janasena chief Pawan Kalyan

అయితే గెలిచాక ఎమ్మెల్యే అయిన ఆనందం కూడా లేకుండా నిర్బంధించే రీతులో వ్యవహరించారు. ఈ క్రమంలో పొమ్మనలేక పొగ పెట్టే రీతిలో క్రాస్ ఓటింగ్ కారణం చూపిస్తూ సస్పెండ్ చేసేసారు ఇది చాలా అన్యాయం.. అనీ ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీని దెబ్బ కొట్టడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఉండవల్లి శ్రీదేవి సరికొత్త పొలిటికల్ ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే తాడికొండ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు

Advertisement

Pawan Kalyan shows 'chappal' to warn YSRCP over 'package star' jibe | VIDEO  - Oneindia News

కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో.. పాటు ఉండవల్లి శ్రీదేవి భర్త శ్రీధర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేపథ్యంలో ఇద్దరు జనసేన పార్టీలో జాయిన్ అవటానికి రెడీ అయ్యారంట. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో.. జనసేన పార్టీ తరఫున శ్రీదేవి భర్త శ్రీధర్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు.. పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని మాత్రం గట్టిగా దెబ్బ కొట్టాలని ఉండవల్లి శ్రీదేవి హైదరాబాదులో భారీగా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement