Sand Meal : అన్నంకు బదులు ఇసుకనే 60 ఏళ్లుగా తింటున్న బామ్మ..! రోజుకు ఎంత తింటదో తెలుసా..?
Sand Meal : మనం తినే ఆహారంలో ఇసుక రేనువు వస్తేనే ఆ అన్నం పక్కన పెడుతాం. అలాంటిది ఈ బామ్మ రోజుకు కిలోలకి కిలోలు తింటూ అందరికి షాక్ ఇస్తుంది. అసలు విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ బామ్మ కుష్మావతి దేవి రోజు అన్నం కు బదులు ఇసుక తింటూ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ బామ్మ ఇలా 60 ఏళ్లుగా తింటుందని తెలుస్తుంది. భోజనంకు బదులుగా రోజు రెండు కిలోల ఇసుక తింటుంది. అయినా కూడా ఈ బామ్మ ఆరోగ్యం చెక్ చెదరలేదు. ఈ విషయాన్ని ఆ బామ్మను అడిగితే నవ్వుతూ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానిక అసలు రహస్యం రోజు ఇసుక తినడం అంటూ చెబుతుంది.
ఈ వింత అలవాటు తెలిసినవారు షాక్ అయ్యారు. ఇలా రోజు ఇసుకను తినడం అలవాడు డాక్టర్ చెప్పిన సలహాతో వచ్చిందని బామ్మ చెబుతుంది. ఈ బామ్మ వయసులో ఉన్నప్పుడు ఆమెకు భరించలేని కడుపునొప్పి వస్తే … డాక్టర్ వద్దకు వెళ్తె డాక్టర్ రోజూ కొద్దిగా బూడిద తినమని చెప్పార. అప్పుడు ఆ కుష్మావతి దేవి రోజూ బూడిద తినడం మొదలు పెట్టి.. మెల్లగా ఇసుకను తినడం స్టార్ట్ చేసిందట. అప్పుడు తినడం మొదలు పెట్టిన బామ్మ ఇప్పటికీ తింటూనే ఇందట.. అయితే ఆ ఇసుక తినే ముందు దానిని శుభ్రంగా నీటిలో కడిగి తర్వాత తింటుందట.

up woman Eat Daily Sand Meal
Sand Meal : బామ్మకు రోజుకు ఇసుక ముద్ద లేనిదే ముద్ద దిగదు
అయితే ఈ ఇసుక తినడం మాన్పించడానికి వాళ్ల కుటుంబం మొత్తం ప్రయత్నం చేసిందట. ఆ బామ్మకు ఇద్దరు కుమారులు.. వారి పిల్లలు చెప్పినా కూడా ఇసుక తినడం మానలేదట. తన ఫ్యామిలీ ఇసుక తినడం మానేయమంటున్నారని వాళ్ల నుంచి దూరంగా వెళ్లి నివసిస్తుందట. ఈ 75 ఏళ్ళ బామ్మ తన ఇంటి పనులు, పొలం పనులు ఎంతో ఉత్సహంగా చేసుకుంటుందట. అయితే బామ్మ ఇలా ఇసుక తినడానికి కారణం ఐరన్ లోపం ఉండోచ్చు అని డాక్టర్ లు చెబుతున్నారు . ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.