UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన ఈ ఇంటర్‌ఫేస్ 2016లో లాంఛ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దూసుకుపోతుంది. తాజాగా, 2025 ఆగస్టు నెలలో ఈ వ్యవస్థ ఆల్‌టైమ్ హైకి చేరింది.

#image_title
ట్రాన్సాక్షన్ల సంఖ్య, విలువ – రెండింట్లోనూ బిగ్ బ్లాస్ట్
ఆగస్టు 2025లో జరిగిన యూపీఐ లావాదేవీలు 20 బిలియన్లకు (2,000 కోట్లు) చేరాయి. ఇదే కాదు, మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ కూడా రూ. 24.85 లక్షల కోట్లు దాటి చరిత్ర సృష్టించింది. ఇది యూపీఐ చరిత్రలో ఒక్క నెలలో నమోదైన గరిష్ఠం. నిరంతరం మారుతున్న యూపీఐ యాప్‌ల పోటీలో ఫోన్ పే మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఫోన్ పే:
ట్రాన్సాక్షన్లు: 960 కోట్లకు పైగా
మార్కెట్ షేర్ (వాల్యూ పరంగా): 48.64%
విలువ: రూ. 12 లక్షల కోట్లకు పైగా
గూగుల్ పే:
ట్రాన్సాక్షన్లు: 740 కోట్లకు పైగా
మార్కెట్ షేర్: 35.53%
విలువ: రూ. 8.83 లక్షల కోట్లు
పేటీఎం:
మార్కెట్ షేర్: 8.5% కి తగ్గింది
వినియోగం కాస్త తగ్గుదలకు గురైంది
ఇతర యాప్‌ల్లో నవీ, క్రెడ్ వంటి వాటి మార్కెట్ షేర్ తక్కువగా ఉన్నప్పటికీ, వాటి వినియోగం స్థిరంగా కొనసాగుతోంది.