Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే ఫ్రీగా సేవలు ఇస్తూనే ఎన్ని కోట్లు వెనకేసుకుంటున్నారో తెలిస్తే షాకే…!
ప్రధానాంశాలు:
ఫ్రీ గా ఇస్తూ ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే ఫ్రీగా సేవలు ఇస్తూనే ఎన్ని కోట్లు వెనకేసుకుంటున్నారో తెలిస్తే షాకే...!
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న టిఫిన్ సెంటర్ నుండి పెద్ద షాపుల వరకూ అందరూ వీటినే వినియోగిస్తున్నారు. వినియోగదారులకైతే అన్ని సర్వీసులు ఉచితంగా అందుతున్నా, ఈ సంస్థలు వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఓ వ్యూహం ఉంది. వినియోగదారుల ఉచిత సేవలే ఈ యాప్స్‌కు ఆదాయ మార్గాలుగా మారాయి.

Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే ఫ్రీగా సేవలు ఇస్తూనే ఎన్ని కోట్లు వెనకేసుకుంటున్నారో తెలిస్తే షాకే…!
Google Pay, PhonePe : కోట్ల రూపాయిలు దండుకుంటున్న గూగుల్ పే, ఫోన్ పే ..అదేలనో తెలుసా..?
గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ తమ ఆదాయంలో ప్రధాన భాగాన్ని వాయిస్ స్పీకర్ల ద్వారా పొందుతున్నాయి. కిరాణా షాపులకి నెలవారీ అద్దెతో ఇవి అందించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది స్టోర్లలో వీటి వినియోగం జరుగుతోంది. మరోవైపు, స్క్రాచ్ కార్డ్స్ కూడా ఆదాయానికి ఉపయోగపడుతున్నాయి. వినియోగదారులకు గిఫ్ట్‌ల రూపంలో వచ్చే ఈ కార్డులు, బ్రాండ్ ప్రమోషన్‌తో పాటు యాప్స్‌కు కమిషన్ రూపంలో డబ్బు అందిస్తాయి.
యాప్ వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయకపోయినా, వ్యాపారుల నుండి చెల్లింపులపై కమీషన్లు వసూలు చేస్తాయి. అలాగే అధిక మొత్తంలో రీచార్జ్‌లు లేదా కొన్ని ప్రత్యేక సేవల కోసం తక్కువ మొత్తంలో ఫీజులు కూడా తీసుకుంటున్నాయి. అంతేగాక యాప్స్‌లో వచ్చే ప్రకటనల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం పొందుతున్నాయి. ఈ విధంగా వినియోగదారులకు ఉచిత సేవలే ఆ సంస్థలకు వేల కోట్లు తెచ్చిపెడుతున్నాయి.