Endu Chepala Pulusu : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయే మనందరికీ తెలుసు. కొందరు చేపలలో ముళ్ళు ఉంటాయని తినడానికి ఇష్టపడరు. కానీ పచ్చి చేపలు కాకుండా ఎండు చేపలతో పులుసు చేసుకుని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది .అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఎప్పుడు చేయని విధంగా ఎండు చేపల పులుసు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేశారంటే ఎప్పుడు తినని వారు కూడా ఇప్పుడు తింటారు. ఇక ఆలస్యం ఎందుకు ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) ఎండు చేపలు 2) ఆయిల్ 3) మెంతులు 4) ఆవాలు 5) కరివేపాకు 6) అల్లం 7)టమాటా 8) ఉల్లిపాయ 9) ములక్కాడ 10) కంద 11) వంకాయ 12) పచ్చిమిర్చి 13) పసుపు 14) ఉప్పు 15) కొత్తిమీర 16) చింతపండు 17) చిక్కుడు గింజలు 18) ధనియాల పొడి 19) కారంపొడి 20) తోటకూర కాడలు తయారీ విధానం : ఎండు చేపల పులుసును మట్టి పాత్రలో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అర టీ స్పూన్ మెంతులు, ఒకటి స్పూన్ ఆవాలు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి. తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 10 ,12 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ సన్నని అల్లం తరుగు వేసి మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
తర్వాత ఇందులో పావు కప్పు చిక్కుడు గింజలు, 15, 20 కందముక్కలు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో 7, 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఐదు ఆరు ములక్కాడ ముక్కలు, ఒక వంకాయ ముక్కలు ఎనిమిది ముల్లంగి ముక్కలు, రెండు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి కలుపుకొని నాలుగైదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసి వేడి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాములు చింతపండు రసాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు తోటకూర కాడలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆరుఎండు చేపలను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గంట తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
This website uses cookies.