Royal Tiffins : నోరూరించే దోశ కావాలా? వెరైటీ దోశ కావాలా? అయితే.. రాయల్ టిఫిన్స్ కు వెళ్లాల్సిందే..!
Royal Tiffins : రాయల్ టిఫిన్స్.. పేరు విన్నారా ఎప్పుడైనా? హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఫేమస్ టిఫిన్ హోటల్. ఒక్క అబిడ్స్ లోనే కాదు.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దీని ఔట్ లెట్స్ ఉన్నాయి. నోరూరించే దోశ కావాలన్నా.. వెరైటీ దోశ కావాలన్నా.. ఖచ్చితంగా రాయల్ టిఫిన్స్ కు వెళ్లాల్సిందే.
అయితే.. రాయల్ టిఫిన్స్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. కానీ.. 2011 లో ఇద్దరు అన్మదమ్ములు కలిసి రాయల్ టిఫిన్స్ ను ప్రారంభించారు. అప్పుడు రాయల్ టిఫిన్స్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం తినడానికి కూడా తిండి లేకపోవడంతో కష్టపడి.. అప్పు తెచ్చి టిఫిన్ సెంటర్ పెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. నాణ్యత, టేస్ట్.. ఈ రెండింటినే నమ్ముకుని.. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు.. అదే నాణ్యతను మెయిన్ టెన్ చేస్తూ.. కస్టమర్ల అభిమానాన్ని చురగొన్నారు.
Royal Tiffins : ఇప్పుడు వాళ్ల వద్దే 50 మంది వర్కర్లు పనిచేస్తున్నారు
నెమ్మదిగా రాయల్ టిఫిన్స్ ను విస్తరించి.. హైదరాబాద్ లో మరో నాలుగు ఔట్ లెట్స్ ను పెట్టి.. ప్రస్తుతం నెలకు లక్షలు సంపాదిస్తున్నారు ఆ ఇద్దరు అన్మదమ్ములు. రాయల్ టిఫిన్స్ లో అన్ని రకాల వెరైటీల దోశలు లభిస్తాయి. అది కూడా ఎంతో టేస్ట్ గా ఉండే దోశ. ఎప్పుడైనా అబిడ్స్ వెళ్లితే.. రాయల్ టిఫిన్స్ లో దోశ తినడం మాత్రం మరిచిపోకండి.