పండుగపూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్...!
Vegetable Rates : కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతుండడం మనం చూస్తున్నాం.. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ)ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేదు.భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. అధిక ధరలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసిన నాణ్యతలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు చాలా ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంటలను నీటముంచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వానలు సృష్టించిన బీభత్సంతో కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. డిమాండుకు తగ్గ దిగుబడి లేదని రైతులు అంటున్నారు. మొన్నటి వరకు శ్రావణమాసం, ఇక ఇప్పుడు వినాయక చవిత సందర్భంగా తెలుగిళ్లలో చాలా మంది శాకాహారానికే ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో డిమాండుకు సరిపడా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
పండుగపూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్…!
ధరలు తక్కువ ఉన్నప్పుడు రెండు మూడు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు 1000 పెట్టుకున్నా కూడా సగం కూరల సంచి నిండడం లేదంటూ కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర కూడా సెంచరీకి దగ్గర ఉండడంతో కొనేవారికి కన్నీళ్లు తెప్పిస్తుంది. గతంలో ఓ సారి టమాటా ధర కిలో రూ.300 ఉండేది. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేలా ఉందని అంటున్నారు. ఏదేమైన ప్రస్తుత కూరగాయల ధరలు చూసి అందరు గగ్గోలు పెడుతున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.