
YSRCP : విశాఖలో వైసీపీకి షాక్..!
Ycp : రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం.అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వారి లోపాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. అలానే ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో ఉన్న వారి లోపాల గురించి ఆరాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు.అయితే అలా తెలుసుకోవాలని ఇటీవలి కాలంలో కోవర్టులు వచ్చారు. పార్టీతో మంచిగా ఉంటూనే సీక్రేట్స్ ప్రత్యర్ధి పార్టీలకు చేరవేయడం. వైసీపీ విషయానికి వస్తే కోవర్టుల బెడద ఆది నుంచి ఎక్కువే. ఎందుకంటే వైసీపీలో చేరిన వారు అంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కావడంతో వారు పార్టీకి విధేయుల మాదిరిగానే ఉన్నారు.
అయితే రాను రాను పరిస్థితులు మారాక వైసీపీ నుండి జారుకున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వైసీపీలో చూస్తే ఎన్నికల ముందు నుంచి కూడా ఈ కోవర్టుల బెడద ఎక్కువగానే ఉంది అని ప్రచారం సాగింది. వీరంతా వైసీపీలో ఉంటూ అక్కడ ముఖ్యమైన సమాచారాని టీడీపీ కూటమికి ఎప్పటికపుడు చేరుస్తూ తాము ఉన్న పార్టీనే ముంచేశారు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఎన్నికలు అయ్యాయి. వైసీపీ ఓటమి పాలు అయింది. మరి ఇపుడు కూడా కోవర్టులు పార్టీలో ఉన్నారా అనే ప్రచారం జరుగుతుంది, ఇప్పటికే జగన్ వారిని కనిపెట్టి బయటకు పంపించారు అనే టాక్ కూడా ఉంది. అయితే ఈ కోవర్టులను ఎలా గుర్తించడం అంటే అక్కడే చాలా తమాషాలు జరుగుతున్నాయి. వైసీపీలో పెద్ద నాయకులలో కొందరిని అసలు పచ్చ మీడియా అయితే పట్టించుకోవడం లేదు, వారిని టార్గెట్ కూడా చేయడం లేదు.
Ycp : వైసీపీలో కోవర్టులు ఇంకా ఉన్నారనే దానిలో వాస్తవమెంత.. పచ్చ మీడియా వారిని ఎందుకు టార్గెట్ చేయడం లేదు..!
పచ్చ మీడియా వీరి మీద సాఫ్ట్ కార్నర్ తో ఉందీ అంటే వీరంతా టీడీపీ కూటమితో కుమ్మకు అయినట్లే అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. కొంతమందికి చుక్కలు చూపిస్తున్న కూటమి ప్రభుత్వం వారిపై కన్నెత్తి చూడడంలేదంటే వారంతా కోవర్టులుగా ఉన్నారని పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే రకాలు కూడా ఉన్నాయి. వీరు కూడా పూర్తిగా వైసీపీ శిబిరాన్ని ఖాళీ చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు. ఇంకొందరు అయితే పార్టీలో కేవలం ఉండేదే ఇలాంటి సమాచారం చేరవేసేందుకు అని అంటున్నారు. నేరుగా వెళ్ళి కూటమి తీర్ధం పుచ్చుకోకుండా ఇక్కడే ఉండి అక్కడకు మేలు చేస్తున్నారు అని జనాలు ముచ్చటించుకుంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.