పండుగ‌పూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పండుగ‌పూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్…!

Vegetable Rates : కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతుండ‌డం మనం చూస్తున్నాం.. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ)ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేదు.భారీ వర్షాల కారణంగా కూరగాయల […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •   పండుగ‌పూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్...!

Vegetable Rates : కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతుండ‌డం మనం చూస్తున్నాం.. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ)ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేదు.భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. అధిక ధరలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసిన నాణ్యతలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

Vegetable Rates భ‌గ్గుమంటున్న ధ‌ర‌లు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు చాలా ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంటలను నీటముంచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వానలు సృష్టించిన బీభత్సంతో కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. డిమాండుకు తగ్గ దిగుబడి లేదని రైతులు అంటున్నారు. మొన్నటి వరకు శ్రావణమాసం, ఇక ఇప్పుడు వినాయక చవిత సందర్భంగా తెలుగిళ్లలో చాలా మంది శాకాహారానికే ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో డిమాండుకు సరిపడా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

పండుగ‌పూట సామాన్యులకు మధ్యతరగతికి భారీ షాక్

పండుగ‌పూట సామాన్యులకు, మధ్యతరగతికి భారీ షాక్…!

ధరలు తక్కువ ఉన్నప్పుడు రెండు మూడు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు 1000 పెట్టుకున్నా కూడా సగం కూరల సంచి నిండడం లేదంటూ కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర కూడా సెంచరీకి దగ్గర ఉండడంతో కొనేవారికి కన్నీళ్లు తెప్పిస్తుంది. గ‌తంలో ఓ సారి ట‌మాటా ధ‌ర కిలో రూ.300 ఉండేది. మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంద‌ని అంటున్నారు. ఏదేమైన ప్ర‌స్తుత కూర‌గాయ‌ల ధ‌ర‌లు చూసి అంద‌రు గ‌గ్గోలు పెడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది