Venu Yellamma : మొదటిసారి ఎల్లమ్మ గురించి వేణు స్పందన.. భక్తి శ్రద్ధలతో అంటూ ట్విస్ట్..!
ప్రధానాంశాలు:
Venu Yellamma : మొదటిసారి ఎల్లమ్మ గురించి వేణు స్పందన.. భక్తి శ్రద్ధలతో అంటూ ట్విస్ట్..!
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ గురించి స్పందించారు. తనను ఒక కమెడియన్ గానే చూసిన తెలుగు ఆడియన్స్ కు తనలోని డైరెక్షన్ టాలెంట్ తో మెప్పించిన వేణు మొదటి సినిమా బలగంతో సెన్సెషనల్ హిట్ అందుకున్నాడు. బలగం సినిమా కథ, కథనం ఎంతో హృద్యంగా ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వేణు తన సెకండ్ సినిమాను ఎల్లమ్మతో వస్తున్నాడు. ఈ సినిమా కథ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నటు చెప్పుకొచ్చారు వేణు. బలగం లా ఇది తెలంగాణా నేపథ్యంగా కాకుండా అందరు ఓన్ చేసుకునేలా ఉంటుందని అన్నారు. ఎల్లమ్మ అంటే శక్తి స్వరూపమని.. ఐతే ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తాం కానీ అమ్మ ఒక్కటే అని అన్నారు వేణు.
Venu Yellamma బలగం ని మించి ఎల్లమ్మ ప్లాన్..
సో ఎల్లమ్మ కథ గురించే ఇంతగా చెబుతున్నాడు అంటే కచ్చితంగా వేణు ఈ సినిమా కథను కూడా అందే రేంజ్ లో రాసుకున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫైనల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసే పనుల్లో ఉన్న వేణు 2025 లో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని. సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ కూడా అప్పుడే వెల్లడిస్తామని అన్నారు. బలగం సినిమాలా ఇది కేవలం తెలంగాణా నేపథ్యంతో కాకుండా ఎల్లమ్మ కథ కచ్చితంగా అందరికీ నచ్చేలా చేస్తామని అన్నారు.
వేణు యెల్దండి చెప్పిన మాటలను బట్టి చూస్తే బలగం ని మించి ఎల్లమ్మ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో తెలుస్తుంది. జనవరిలో అనౌన్స్ మెంట్ నెక్స్ట్ వెంటనే షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. వేణు తన డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది ఎల్లమ్మతో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. Venu First Reaction about Yellamma Movie , Venu, Balagam, Yellamma, Tollywood, Dil Raju, Nitin