Video Call : గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడద్దు అన్నాడు అని తండ్రి తల పగలగొట్టిన కొడుకు..!!

Advertisement

Video Call : ప్రస్తుత కాలంలో దారుణాలు ఎక్కువైపోయాయి. ప్రేమ కోసం తమ సొంత వాళ్లని చంపుకుంటున్నారు. ఇటీవల వరంగల్లో ప్రీతి మరణించింది. అలాగే హైదరాబాదులో ప్రేమ కోసం ఓ యువకుడు తన సొంత ఫ్రెండ్ని చంపేసుకున్నాడు. ఇప్పుడు ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ లో ఉండి తండ్రిని దాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. 21 ఏళ్ల కూలి పనిగా చేస్తున్న భరత్ తన ప్రియురాలితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు తన తండ్రి ఢిల్లీ బాబుపై దారుణంగా దాడి చేశాడు.

Advertisement
video call son murder attempt to his father for love
video call son murder attempt to his father for love

భరత్ కు ఆ ప్రాంతంలోని 39 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతని తండ్రి అది మానుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు భరత్ కు కౌన్సిలింగ్ ఇప్పించారు. దీంతో ఆగ్రహించిన భరత్ త్వరలోనే తన తండ్రిని కొడతానని బహిరంగంగా చెప్పాడు. అనుకున్నట్టే భరత్ తను ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతుండగా తండ్రి అడ్డుపడ్డాడు, వద్దని వారించిన వినిపించుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న భరత్ తన తండ్రిని మెటల్ రాడ్డుతో తలపై గట్టిగా కొట్టాడు.

Advertisement

Man Attacks Father While On Video Call With Lover

దీంతో తండ్రి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఇదంతా 39 ఏళ్ల ప్రియురాలితో వీడియో కాల్ లో ఉండగా జరిగింది. గాయం కారణంగా తండ్రికి చాలా రక్తం పోయింది. దీంతో ఇరుగుపొరుగు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన తండ్రి పై దాడి చేసిన యువకుడి పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడిని కష్టడీలో తీసుకున్నారు. ఏంటో ప్రస్తుతం కాలం ఎంత నీచంగా తయారయ్యిందంటే మాటల్లో చెప్పలేం. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా చెడు మార్గాలలో వెళుతూ దారుణంగా తయారవుతున్నారు.

Advertisement
Advertisement