Taylor Swift : అమెరికా ఎకానమీ ని ఒక్క పాట తో పైకి లేపుతోంది ఈ అమ్మాయి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Taylor Swift : అమెరికా ఎకానమీ ని ఒక్క పాట తో పైకి లేపుతోంది ఈ అమ్మాయి !

 Authored By sekhar | The Telugu News | Updated on :16 July 2023,9:00 pm

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో పటిష్టమైనది అమెరికా ఆర్థిక వ్యవస్థ. ప్రపంచానికే సూపర్ పవర్ కంట్రీగా అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద వివాదాలలో సైతం అమెరికా తల దూర్చి సమస్యను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా అమెరికా చాలా బలమైన శక్తివంతమైన దేశం. అయితే అటువంటి అమెరికా దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఎకనామిని ఓ లేడీస్ సింగర్ అమాంతం పెంచేస్తూ ఉందట.

పూర్తి విషయంలోకి వెళ్తే 33 సంవత్సరాలు వయసున్న లేడీ పాప్ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టేలర్‌ స్విఫ్ట్‌ స్వరం అంటే అమెరికన్స్ పడిచస్తారు. అటువంటి ఈ యువ సంచలన లేడీస్ సింగర్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందట. మేటర్ లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థను కట్టు తప్పడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫెడరల్ బ్యాంకు పలుమార్లు వడ్డీ సవరణలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక మాంద్యానికి ఆద్యం పోశాయి. ఈ పరిణామంతో పెద్ద పెద్ద కంపెనీలో లే ఆఫ్ ప్రకటించాయి. మరోపక్క రష్యా ఉక్రెన్ యుద్ధం కారణంగా కూడా పలు ఇబ్బందులు ఎదురు కావడం జరిగాయి. కాగా అమెరికా ఆదాయానికి వెన్నెముక అయినా అతిధ్య రంగం కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది.

This girl is lifting the American economy with a single song

This girl is lifting the American economy with a single song

దీంతో దేశ ఆదాయం పై ప్రభావం ఎక్కువ చూపటంతో గత కొన్ని నెలలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక ఆటుపోట్లు ఎదుర్కోవటం జరిగింది. ఇలాంటి పరిస్తితిలో అనూహ్యంగా అమెరికా అతిధ్య రంగం పుంజుకుంది. దీనికి ప్రధాన కారణం సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ అని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ లేడీ పాప్ సింగర్ ఒకప్పుడు మైకల్ జాక్సన్ తరహాలో అమెరికాలో షోలు చేస్తూ సంగీత ప్రియులను మైమరిపిస్తుంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలో అంచులో ఉండగా.. అమెరికా పాలకులు చేయలేనిది ఈ 33 వయసు కలిగిన టేలర్‌ స్విఫ్ట్‌.. తన షోస్ ద్వారా… ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం తీసుకురావడం జరిగిందట. దీంతో ఈ లేడీ పాప్ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది