Modi Target : మోడీ టార్గెట్ 350 – జరిగే పనేనా? దీ తెలుగు న్యూస్ విశ్లేషణ !
Modi Target : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మనం మాట్లాడుకునేది తెలుగు రాష్ట్రాల ఎన్నికల గురించి కాదు. పార్లమెంట్ ఎన్నికల గురించి. తెలంగాణలో, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అసలు కేంద్రంలో ఏం జరుగుతోంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెగ హడావుడి చేసిన బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా? అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం […]
Modi Target : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మనం మాట్లాడుకునేది తెలుగు రాష్ట్రాల ఎన్నికల గురించి కాదు. పార్లమెంట్ ఎన్నికల గురించి. తెలంగాణలో, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అసలు కేంద్రంలో ఏం జరుగుతోంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెగ హడావుడి చేసిన బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా? అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు 303. అంటే అవి ఎన్డీఏ సీట్లు. అంటే అవి రికార్డు స్థాయి స్థానాలు అనే చెప్పుకోవాలి. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 300 కాదు.. 350 ప్లస్ సీట్లు సాధించాలనే టార్గెట్ ను పెట్టుకుంది బీజేపీ. 350 సీట్లు గెలిస్తే ఇక మామూలుగా ఉండదు. బీజేపీకి ఇక తిరుగే ఉండదు. దాని కోసమే బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ చతికిలపడిందో అక్కడ ఇప్పుడు బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ అంతగా రాణించలేకపోయింది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో అయితే బీజేపీ ఓడిపోయిందో వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆ జాబితాలో 150 నియోజకవర్గాలు ఉన్నాయి.
Modi Target : మిషన్ సౌత్ ఇండియా స్టార్ట్
దానిలో భాగంగానే మిషన్ సౌత్ ఇండియాను బీజేపీ స్టార్ట్ చేసింది. మిషన్ సౌత్ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవలే సౌత్ రీజియన్ రాష్ట్రాల సమావేశం హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఉన్న 129 ఎంపీ సీట్లలో చాలావరకు బీజేపీ గెలువగలిగితే టోటల్ గా 350 సీట్లను గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి.. బీజేపీ తన టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో?