vijayasai reddy : ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది విజయ్ సాయి రెడ్డి కి , జగన్ కూడా వామ్మో అనుకున్నాడు
vijayasai reddy : వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీతో మచ్చిక చేసుకునేందుకు ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉంటాడు. తమ అధినేత వైఎస్ జగన్ కు మోడీకి ఉన్న గ్యాప్ ను తొలగించేందుకు విజయసాయి రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు చేస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే విజయ సాయి రెడ్డి గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్రంపై ముఖ్యంగా అమిత్ షా పై ఎగిరి పడటం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లో విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం వైఎస్ జగన్ కు కూడా కాస్త కంగారు పెట్టించాయి. ఎందుకన్నా వాళ్లతో గొడవ అన్నట్లుగా వైఎస్ జగన్ మెల్లగా విజయ సాయి రెడ్డిని కూల్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయి. వైకాపా నాయకులు ఎప్పుడు కూడా బీజేపీపై సీరియస్ గా విమర్శలు చేయడం వ్యక్తిగత విమర్శలకు దిగడం చేయకూడదు అనేది పార్టీ అధినేత ఆదేశం. కాని ఈసారి ఎంపీ విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని మర్చాడు.
vijayasai reddy : పార్లమెంట్ లో కడిగేశాడు..
రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటూ మోసం చేసిన నిధులు పథకాలు కేటాయింపుల గురించి విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో ప్రస్థావించాడు. ప్రత్యేక హోదా నుండి మొదలుకుని నిన్న మొన్న జరుగుతున్న గొడవ విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు అనేక విషయాల్లో విజయసాయి రెడ్డి రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు ముందు ఏకరువు పెట్టాడు. అధ్యక్ష మీకు తెలుసు అంటూ ఎన్నో విషయాలను సభ ముందుకు తీసుకు వచ్చి బీజేపీ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మాట ఇవ్వడం తప్పడం అనేది బీజేపీ వారికి చాలా కామన్ అయ్యిందని ఏపీ ప్రజల మనో భావాలతో ఆడుకుంటూ చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఎప్పుడు లేనంతగా విజయసాయి రెడ్డి బీజేపీపై విమర్శలు కురిపించాడు.
విజయసాయితో వైఎస్ జగన్ చర్చ…
పార్లమెంట్ లో బీజేపీపై ఓ రేంజ్ లో విరుచుకు పడ్డ విజయ సాయి రెడ్డి ఖచ్చితంగా వైఎస్ జగన్ డైరెక్షన్ లోనే ఇలా చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన విషయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు పై మాటలే అంటున్నారు. బీజేపీతో మచ్చిక చేసుకోవాలని, ఎప్పటికి అయినా వారితో కలిసి నడవాల్సిందే అంటూ జగన్ భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో విజయసాయి రెడ్డి బీజేపీతో సున్నం పెట్టుకోవడం పట్ల ఒక వైపు వైఎస్ జగన్ ఆందోళన చెందుతూనే రాష్ట్రం సమస్యలను రాజ్యసభలో ప్రస్థావించి కేంద్ర ప్రభుత్వంను కడిగేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా వైఎస్ జగన్ ఒక వైపు ఆనందం మరో వైపు ఆందోళన ను అనుభవిస్తున్నాడు.