Viral News : కోటీశ్వ‌రులు చేయ‌లేని ప‌ని.. ఓ యాచ‌కుడు చేశాడు.. 50 ల‌క్ష‌లు విరాళంగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral News : కోటీశ్వ‌రులు చేయ‌లేని ప‌ని.. ఓ యాచ‌కుడు చేశాడు.. 50 ల‌క్ష‌లు విరాళంగా

Viral News : కోటీశ్వ‌రులు చేయ‌లేని ప‌ని ఓ యాచ‌కుడు చేస్తున్నాడు. కోట్ల సంప‌ద ఉన్నా ఎంతో మంది క‌నీసం తోటి వారికి సాయం చేయ‌డానికి ముందుకు రారు. కోట్లు ఉన్నా త‌మ‌దారి తాము చూసుకుంటున్న ఈ రోజుల్లో మంచి చేయాల‌ని త‌ల‌చి ఒక యాచ‌కుడు బిక్షాట‌న చేసి ఏకంగా రూ.55.60 ల‌క్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు సాయం చేశాడు. అది ఎలా సాధ్యం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. భిక్షాటన చేయగా.. వచ్చిన డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తూ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,6:30 am

Viral News : కోటీశ్వ‌రులు చేయ‌లేని ప‌ని ఓ యాచ‌కుడు చేస్తున్నాడు. కోట్ల సంప‌ద ఉన్నా ఎంతో మంది క‌నీసం తోటి వారికి సాయం చేయ‌డానికి ముందుకు రారు. కోట్లు ఉన్నా త‌మ‌దారి తాము చూసుకుంటున్న ఈ రోజుల్లో మంచి చేయాల‌ని త‌ల‌చి ఒక యాచ‌కుడు బిక్షాట‌న చేసి ఏకంగా రూ.55.60 ల‌క్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు సాయం చేశాడు. అది ఎలా సాధ్యం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. భిక్షాటన చేయగా.. వచ్చిన డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు డబ్బులు అందజేశాడు.

Viral News: గౌట్ స్కూళ్ల‌లో..

తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల‌ పూల్‌పాండి యాచకుడిగా త‌న జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. కాగా సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి తన దగ్గర ఉన్న రూ.10 వేల‌ను సీఎం సహాయ నిధి ఇవ్వాలంటూ కోరాడు. శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌ కు నగదు అందచేశారు. అయితే ఇత‌ను 12 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్నాడ‌ట‌.

Viral News A beggar donated 50 lakh rupees

Viral News A beggar donated 50 lakh rupees

ఇలా వ‌చ్చిన‌ డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నాడ‌ట‌. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, న‌గ‌దును విరాళంగా అంద‌జేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కోట్ల సంప‌ద ఉండి కూడా ఇలాంటి పనులు చేయించటానికి ఎవరు ముందుకు రారు. అట్లాంటిది ఓ యాచకుడు త‌ను అడుకున్న డ‌బ్బును విరాళంగా ఇవ్వ‌డం గ్రేట్ అని న‌టిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు. కామెంట్ల రూపంలో ప్ర‌శంసిస్తున్నారు. ఎంతో మంది నిత్యం బిక్షాట‌న చేస్తున్న‌ప్ప‌టికీ ఇత‌ను మాత్ర‌మే ఇలా సాయం చేస్తుండ‌టం విశేషం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది