Viral News : కోటీశ్వరులు చేయలేని పని ఓ యాచకుడు చేస్తున్నాడు. కోట్ల సంపద ఉన్నా ఎంతో మంది కనీసం తోటి వారికి సాయం చేయడానికి ముందుకు రారు. కోట్లు ఉన్నా తమదారి తాము చూసుకుంటున్న ఈ రోజుల్లో మంచి చేయాలని తలచి ఒక యాచకుడు బిక్షాటన చేసి ఏకంగా రూ.55.60 లక్షలను ఇప్పటి వరకు సాయం చేశాడు. అది ఎలా సాధ్యం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.. భిక్షాటన చేయగా.. వచ్చిన డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి లక్షల రూపాయలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు డబ్బులు అందజేశాడు.
తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల పూల్‌పాండి యాచకుడిగా తన జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి తన దగ్గర ఉన్న రూ.10 వేలను సీఎం సహాయ నిధి ఇవ్వాలంటూ కోరాడు. శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్ కు నగదు అందచేశారు. అయితే ఇతను 12 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్నాడట.
ఇలా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నాడట. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, నగదును విరాళంగా అందజేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్ల సంపద ఉండి కూడా ఇలాంటి పనులు చేయించటానికి ఎవరు ముందుకు రారు. అట్లాంటిది ఓ యాచకుడు తను అడుకున్న డబ్బును విరాళంగా ఇవ్వడం గ్రేట్ అని నటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. ఎంతో మంది నిత్యం బిక్షాటన చేస్తున్నప్పటికీ ఇతను మాత్రమే ఇలా సాయం చేస్తుండటం విశేషం.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.