Viral News : ‘ నా మీసాలు నా ఇష్టం ‘ అంటున్న ఓ మహిళ… ఇలా కూడా ఉంటారా అంటున్న నెటిజన్లు…
Viral News : కేరళలోని కణ్ణూర్ జిల్లాకు చెందినది షిజ. ఈమె తన పేరుకు ముందు, వెనుక ఇంటిపేరు, తన తండ్రి లేదా భర్త పేరు, కులం పేరు ఏమి పెట్టుకోలేదు. ‘ నా మీసాలు అంటే నాకు చాలా ఇష్టం’ అని 35 ఏళ్ళు ఉన్న షిజ వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు. అలాగే మీసాలతో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి చూసినా కొందరు ప్రశంసించగా, మరికొందరు ఎగతాళి చేశారు. అయితే పొగిడిన, తిట్టినా నేనేం పట్టించుకోను నా మీసాలు నా ఇష్టం అంటున్నారు షిజ. షిజ కుటుంబం, స్నేహితులు ఆమె మీసాలు పెంచడానికి అడ్డుకోలేదు, మద్దతుగా నిలిచారు. ‘ మా అమ్మకి మీసాలు బాగుంటాయి ‘ అని షిజ కూతురు అంటూ ఉంటుందంట. అయితే వీధిలో నడుస్తున్నప్పుడు పలువురు రకరకాలుగా కామెంట్లు చేసేవారని షిజ చెప్పారు.
కొంతమంది మహిళలకు ముఖంపై వెంట్రుకలు వస్తాయి. ముఖ్యంగా పెదాల పైన, గడ్డమీద, చంపల పైన వస్తూ ఉంటాయి. ఇలా వెంట్రుకలు వచ్చినప్పుడు థ్రెడింగ్ చేయించుకుంటారు. కను బొమ్మలను షేప్ చేసుకున్నట్లే పేదాలపైన సన్నని మీసాలను తొలగించుకుంటారు. అయితే షిజకు కూడా ఇలాగే ఐదేళ్ల నుంచి మీసాలు పెరగటం ప్రారంభమయ్యాయి. కానీ ఆమె వాటిని తొలగించుకోకుండా అలానే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇప్పుడు మీసాలు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను, నేను అందంగా లేనని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉండకపోతే బాగుంటుంది అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ‘ మీసాలు అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం, ఇంతకుమించి నేనేమీ చెప్పలేను ‘ అంటున్నారు షిజ.
చాలామంది మగవాళ్ళకే మీసం ఉంటుంది. ఆడవాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటూ నవ్వుతూ, ఎగతాళి చేస్తారు. అయినా నేను అవన్నీ పట్టించుకోను. ఇటీవల కాలంలో స్త్రీలు అన్నింటిని ఎదురిస్తున్నారు. అలాగే తమ శరీరత్వాన్ని అంగీకరిస్తున్నారు. 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ నిండుగా గడ్డం పెంచిన అతి చిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకోవడానికి తమ వెంట్రుకలను అంగీకరించడం ఎంతో ముఖ్యమని హర్నామ్ కౌర్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. షిజకు మీసాలు పెంచడం సమాజానికి సందేశం ఇవ్వడం కాదు. తనలో తన వ్యక్తిగతంలో అవి ఒక భాగం అంతే. నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు రెండు జన్మలు ఉంటే మరో జన్మలో ఇతరుల కోసం జీవిస్తాను అని అంటున్నారు షిజ. కానీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.