Viral News : శివుడికి మొక్కి.. ప్రపంచ శాంతి కోసం 48 ఏళ్లుగా చేయి ఎత్తి.. తెలిస్తే షాక్
Viral News : సాధువులు ఎలాంటి ఆహారం తినకుండా ఎన్నో ఏళ్లుగా జ్ఞాన ముద్రలో ఉంటారని వినుంటాం.. నిజంగానే అన్ని సంవత్సరాలు ఎలా ఉంటారని ఆశ్చర్యపోతుంటాం. అలాగే కొంత మంది సాధువులు కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా ఒకే ఆసనంలో కూర్చుంటారు. అయితే అది సాధువులకు మాత్రమే సాధ్యం అవుతుంటాయి. సాధారణ మనుషులతో సాధ్యం కాదు. మనం కాసేపు కూచుంటేనే విలవిలలాడిపోతుంటాం. ఎప్పుడెప్పుడు నిల్చుందామా అని చూస్తుటాం. ఇక కొంచెం వయసు పైబడితే ఇంతో ఇబ్బంది పడుతుంటాం..
కూర్చీలో అరగంట కూర్చుంటేనే ఎటు కదల్లేక ఇబ్బంది పడతాం. అలాంటిది ఓ మామూలు మనిషి.. గతంలో బ్యాంక్ లో కూడా జాబ్ కూడా చేశాడు.. ఏమైందో కానీ 48 సంవత్సరాలుగా ఓ చేతిని పైకి ఎత్తి ఇప్పటికీ దించకుండా ఉంచాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏళ్ల తరబడి ఏలా ఉన్నాడో.. అదెక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..ఆయన పేరు అమర భారతి. గతంలో ఓ బ్యాంక్ లో జాబ్ కూడా చేశాడు. భార్య, పిల్లలతో కలిసి ఉండేవాడు. ఏమైందో తెలియదు కానీ సన్యాసిగా మారినట్లు చెప్పాడు

Viral News The man who held his hand raised for 45 years
ఇక అప్పటి నుంచి శివుడిని తలుచుకుంటూ బతికేస్తున్నాడు. అయితే ప్రపంచ శాంతి కోసం కుడి చేయిని పైకి ఎత్తి శాంతి నెలకొన్నాకే దించుతానని శివుడికి మొక్కి శపథం చేశాడు. ఇక తెలిసిందే కదా ప్రపంచ శాంతి సాధ్యం కాదని.. దీంతో ఇప్పటికీ ఆ సన్యాసి అలాగే చేయి పైకి ఎత్తి ఉంచాడు.అయితే చేయి ఏళ్లుగా అలాగే ఎత్తి ఉంచడంలో ఆ పరమశివుడి మహిమ ఉందని మొదట్లో నొప్పితో బాధపడినట్లు చెప్పాడు. క్రమంగా ఆ చేయి అలా ఉండిపోయిందని చెప్పాడు. ప్రపంచ శాంతి కోసం ఎత్తిన చేయి దించకుండా ఉండటం సహసమనే చెప్పాలి.