Viral Video : పెట్రోల్ ధర 200 రూపాయలకు లీటర్ అయినా నో ప్రాబ్లమ్.. ఎందుకో ఈ వీడియోలో చూడండి
Viral Video : ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయి. వంద రూపాయలు దాటి కూడా నెలలు గడిచాయి. రోజూ రేట్లు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. దాని వల్ల చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటిక వెళ్లాంటే.. బండి తీయాలంటేనే భయడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల.. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ట్రావెలింగ్ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. దాని వల్ల వ్యవసాయం కోసం పని చేసే కూలీల రేట్లు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆటో ఎక్కి దిగితే వంద అడుగుతున్నారు. ఎక్కడ చూసినా.. వందలకు వందలే. దీంతో పేదల పరిస్థితి ఏంటి? బయట అడుగు పెట్టాలంటేనే భయం పట్టుకుంటోంది.

viral video of variety bike with extra vehicle
ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో.. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి కానీ తగ్గడం లేదు. దీంతో వ్యక్తికి వింత ఆలోచన వచ్చింది. అంతే దాన్ని వెంటనే అమలు చేశాడు. ప్రస్తుతం స్థానికంగా ఆ వ్యక్తి పేరు మారుమోగిపోతోంది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Viral Video : బైక్ కు ట్రాలీని కనెక్ట్ చేసి.. బైక్ ను ఎలా తయారు చేశాడో చూడండి
తన బైక్ కు ట్రాలీ లాంటి ఓ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ట్రాక్టర్ కు ఉండే ట్రాలీలా రెండు టైర్లతో దాన్ని తయారు చేయించి.. దాన్ని తన బైక్ తో లింక్ చేయించాడు. ఇంకేముంది.. ఆ ట్రాలీలో కనీసం 5 నుంచి ఆరుగురు వరకు కూర్చోవచ్చు. బండి స్టార్ట్ చేసి.. ముందుకు వెళ్లగానే.. దానితో పాటు.. ఆ ట్రాలీ కూడా వచ్చేస్తుంది. ఓపెట్రోల్ బంక్ లో ఆగి.. ఆ బండికి పెట్రోల్ కొట్టిస్తుండగా.. ఆ సరికొత్త బండిని చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఆ బైక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. మీకు పెట్రోల్ ధర 200 రూపాయలు అయినా కూడా టెన్షన్ అవసరం లేదు. ఇది ఐడియా అంటే. ఏం ఐడియా సర్ జీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
अब पेट्रोल 200 ₹ लीटर भी हो जाये तो भी कोई टेनशन नही ????????#whatsappwonderbox #ViralVideo #FuelPriceHike #PetrolDieselPrice #PetrolPriceHike pic.twitter.com/gOO5jKtSyK
— Pankaj Upadhyay (@pankaju17) July 13, 2021