Viral Video : అసలేంటిది.. మన కళ్లను మనమే నమ్మలేని వీడియో
Viral Video : మేకప్.. ప్రస్తుత జనరేషన్ లో మేకప్ లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకు మేకప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేకప్ ఉంటేనే వాళ్లు కెమెరా ముందుకు వస్తారు. అలాగే.. యూత్ కూడా ఎక్కువగా మేకప్ కు అలవాటు పడిపోయింది. ముఖ్యంగా యువతులు మేకప్ వేసుకుంటేనే బయట అడుగు పెడుతున్నారు. అయితే.. మేకప్ లోనూ ఎన్నో స్టయిల్స్ ఉంటాయి. మేకప్ ముందు మనిషి ఒకలా ఉంటే.. మేకప్ వేశాక మనిషి ఇంకోలా ఉంటాడు.

viral video of variety makep trending
అందుకే.. మేకప్ ను చూసి మనమే ఆశ్చర్యపోతుంటాం. అంతలా మేకప్ వేసే టెక్నిక్స్ వచ్చాయి నేడు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఓ యువతి మేకప్ వీడియో. వెరైటీ మేకప్ వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో గురించే చర్చ.
Viral Video : యువతి వెరైటీ మేకప్.. ముఖం నిండా కళ్లు, పెదాలు, ముక్కు
ఓ వీడియోలో ఓ యువతి మేకప్ వేసుకుంటూ కనిపిస్తుంది. అయితే.. ఆ యువతి ముఖం నిండా కళ్లు, పెదాలే కనిపిస్తాయి. చెవులు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. అసలు ముఖం ఏది? అనే డౌట్ వస్తుంది. అసలైన కళ్లు ఏవి.. ముక్కు ఏది.. చెవులు ఏది.. పెదవులు ఏవి.. తెలుసుకోవడం చాలా కష్టం. ఆ సమయంలో ఆ యువతి.. తన పెదాలకు లిప్ స్టిక్ వేస్తుంటుంది. కానీ.. అది పెదవి కాదు.. కళ్లు. ఇలా.. మన కళ్లే నమ్మలేని విధంగా.. యువతి మేకప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్ మెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
When the edibles hit… pic.twitter.com/BSeBnAAES9
— Rex Chapman???????? (@RexChapman) July 15, 2021