Viral Video : తోటి అమ్మాయికి అలవాటు పడింది.. ఆమె కోసం అబ్బాయిలా కూడా మారింది.. చివర ఆఖరికి జైలు పాలైపోయింది అదిరిపోయే ట్విస్ట్.. వీడియో

Advertisement

Viral Video : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకప్పుడు నేరస్తులంటే పోలీసులకు కనిపెట్టే పరిస్థితి ఉండేది. ఎవరు నేరాలకు పాల్పడతారు అన్నది వారు ఊరికినే అర్థం చేసుకునే అవకాశాలు ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం చీమకు కూడా హాని చేయని వ్యక్తులు ఒక్కసారిగా నేరస్తులుగా మారిపోవటం పోలీసులకు తలనొప్పిగా మారింది. కుటుంబ వ్యవస్థలో అదేవిధంగా యువతలో ఈ రకమైన వ్యక్తులు ఈమధ్య ఎక్కువైపోతున్నారు. సాధారణంగా ప్రేమ విషయాలలో అమ్మాయి కోసం అబ్బాయి ఇతరులను చంపేయడం లేదా చచ్చిపోవటం వంటివి వార్తల్లో మనం ఇంట్లోనే ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్ర మంచిర్యాల జిల్లాలో ఓ అమ్మాయి కోసం మరో అమ్మాయి అబ్బాయిగా మారి…

Advertisement

ఆమెకు అలవాటు పడి దారుణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమరి మండలం మామిడి గట్టుకు చెందిన.. సల్లూరి అంజలి.. తరచూ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. ఆమె అమ్మమ్మది గ్రామ్ నిందల మండలం మన్నెగూడ. ఆ క్రమంలోనే అమ్మమ్మ పక్కింటిలో ఉండే మహేశ్వరి అనే అమ్మాయితో అంజలీకి పరిచయం ఏర్పడింది. మహేశ్వరి తండ్రి విఆర్ఏ. మహేశ్వరికి ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మహేశ్వరి గత పది సంవత్సరాలు నుండి మగాడిగా బతుకుతుంది. వస్త్రధారణ కూడా అబ్బాయిలు లాగానే వేసుకుంటూ ఉంటది. అయితే ఊరిలో మహేశ్వరి ట్రాన్స్ జెండర్ గా మారిందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఈ మహేశ్వరి అంజలి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.

Advertisement
Viral Video The fellow girl became accustomed to her and became like a boy for her
Viral Video The fellow girl became accustomed to her and became like a boy for her

రెండు వేల నుంచి అంజలి కోసం మహేశ్వరి ఒక ప్రత్యేకమైన గది కూడా తీసుకోవటం జరిగింది. ఆ గదిలోనే ఇద్దరు కలిసి బతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో మహేశ్వరి బంకులో పనిచేసేది. అంజలి… కళ్ళజోడు అమ్మే షాపులో పనిచేసేది. అంజలి కోసం.. మహేశ్వరి తన పేరులు మహేష్ గా మార్చుకోవడం జరిగింది. ఇద్దరూ రెండు సంవత్సరాలు పాటు చాలా సన్నిహితంగా ఉన్నారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఊర్లో వాళ్ళకి ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. అయితే మంచిర్యాలలో ఈమధ్య కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే యువకుడితో ఈ మహేశ్వరికి పరిచయం ఏర్పడింది. ఆమె ద్వారా అంజలితో కూడా శ్రీనివాస్ కి పరిచయం ఏర్పడింది. అయితే అందంగా ఉన్న అంజలీతో శ్రీనివాస్ ఎక్కువగా క్లోజ్ అవుతూ ఉండటం జరిగింది.

ఆ తర్వాత శ్రీనివాస్ తోనే ఎక్కువగా అంజలి ఉండేది. ఈ క్రమంలో మహేశ్వరుని పెద్దగా పట్టించుకునేది కాదు. దీంతో తాను పరిచయం చేసిన అబ్బాయితో అంజలి చాలా క్లోజ్ గా ఉండటాన్ని మహేశ్వరి సహించలేకపోయింది. దీంతో తొందరగా అంజలిని పెళ్లి చేసుకోవాలని మహేశ్వరి డిసైడ్ అయింది. అయితే ఇక్కడ అంజలి మహేశ్వరి ఊహించిన ట్వీస్ట్ ఇచ్చింది. నేను మగాలనే పెళ్లి చేసుకుంటాను. శ్రీనివాస్ అంటే ఇష్టమని.. పరోక్షంగా .. మహేశ్వరికి అర్థమయ్యే రీతిలో అంజలి తెలియజేసింది. అయినా మహేశ్వరి..అంజలిని వదిలిపెట్టలేదు. మొదటినుండి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఇన్నాళ్లు కలిసి తిరిగాం దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దని అంజలిని మహేశ్వరి వేడుకంది.

కానీ అంజలి ఏమాత్రం ఒప్పుకోలేదు. పెళ్లి కోసం అంజలిని ఒప్పించాలని మహేశ్వరి ఎన్నీ ప్రయత్నాలు చేసిన.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో తనకి దక్కని అంజలి శ్రీనివాస్ కీ కూడా దక్కకూడదని.. పెద్ద స్కెచ్ వేసింది. తన గదిలో ఉన్న అంజలీని భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మామిడి గట్టుకు వెళదామని సరదాగా ఆమెతో సంభాషణ స్టార్ట్ చేసి మహేశ్వరి ఆమెను తీసుకెళ్లింది. ఈ క్రమంలో మహేశ్వరి తన దగ్గర ఉన్న ఆయుధాలతో అంజలిని హతమరిచింది. పొట్టలో మరియు మెడ భాగంపై విచక్షణ రహితంగా కోసేసింది. అనంతరం.. అంజలి స్నేహితుడు శ్రీనివాస్ కీ మహేశ్వరి ఫోన్ చేయడం జరిగింది. అంజలి ఆత్మహత్య చేసుకుంది.

నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని మహేశ్వరి తెలియజేశారు. ఇంత వెంటనే కంగారు పడ్డ శ్రీనివాస్… మహేశ్వరి చెల్లి మరియు తమ్ముడిని వెంటబెట్టుకుని మామిడి గట్టు వద్దకు రావటంతో రక్తపు మడుగులో అంజలి మరోపక్క మహేశ్వరి ఉన్నారు. దీంతో వెంటనే ఇద్దరినీ హుటాహుటిన హాస్పిటల్ కీ తరలించడం జరిగింది. చికిత్స అందిస్తుండగా అంజలి చనిపోగా మహేశ్వరి కొద్దిపాటి గాయాలతో బతికి బయటపడింది. అయితే పోలీసుల విచారణలో మహేశ్వరి కావాలని అంజలిని చంపి తనని తాను చంపడానికి ప్రయత్నాలు చేసినట్లు నీకు తేల్చడంతో… అంజలి కుటుంబ సభ్యులు మహేశ్వరుని కఠినంగా శిక్షించాలని హాస్పిటల్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పోలీసులు కచ్చితంగా శిక్షిస్తామని మాట ఇవ్వటంతో ధర్నా విరమించుకున్నారు.

Advertisement
Advertisement