Virat kohli Retirement : ఫైనల్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి టీ20 ఆటకి గుడ్ బై.. విరాట్ కోహ్లీ..!
ప్రధానాంశాలు:
virat kohli Retirement : ఫైనల్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి టీ20 ఆటకి గుడ్ బై.. విరాట్ కోహ్లీ..!
virat kohli Retirement : T20 World cup 2024, రన్‌మెషీన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్‌లో ఎంత చెత్త ప్రదర్శన కనబరిచాడో మనం చూశాం. లీగ్, సూపర్ 8 మ్యాచ్‌లలో కూడా రెండు అంకెల స్కోరు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ టోర్నీలో పూర్ ఫామ్ కొనసాగిస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే.. కోహ్లీ వైఫల్యంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మనందరికి తెలిసిందే. అయితే.. కొన్ని సార్లు ఎక్కువ రిస్క్ తీసుకొని ఆడుతున్న సమయంలో ప్రతి సారి కలిసి రాకపోవచ్చు. కోహ్లీ అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆడటాన్ని మెచ్చుకోవాలి. కోహ్లీ చూపిస్తున్న ఇంటెంట్.. మిగతా ప్లేయర్లకు ఒక ఎగ్జామ్‌పుల్‌గా ఉంటుంది.
virat kohli Retirement కీలక ఇన్నింగ్స్..
ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్తున్నాను.. ఫైనల్‌లో కోహ్లీ నుంచి మాత్రం ఒక భారీ ఇన్నింగ్స్ రాబోతుంది అని ఫైనల్ మ్యాచ్‌కి ముందు రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అలానే రోహిత్ శర్మ కూడా కోహ్లీ ఫైనల్‌లో అద్భుతంగా రాణిస్తాడని ఆయనపై నమ్మకం ఉంచారు. అన్నట్టుగానే ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.. 59 బంతుల్లోనే 76 పరుగులతో అత్యంత ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27 రన్స్) రాణించారు.
అయితే కీలక ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న విరాట్ కోహ్లీ తాను టీ20 వరల్డ్ కప్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అవార్డ్ అందుకున్న అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది నా చివరి టీ20 ప్రపంచకప్. మేం సాధించాలనుకున్నది కూడా ఈ విజయమే. ఆ దేవుడు చాలా గొప్పవాడు. కీలక మ్యాచ్‌లో జట్టును గెలిపించే అవకాశాన్ని నాకిచ్చాడు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ ఫైనల్లో ఓడినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. భవిష్యత్తు తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు భారత జెండాను రెపరెపలాడిస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేం ఐసీసీ టైటిల్ గెలిచాం. నాకు ఒక్కడికే కాదు. రోహిత్ 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. నేను 6 టోర్నీలే ఆడాను. ఈ విజయానికి రోహిత్ పూర్తి అర్హుడు. ఎట్టకేలకు ఐసీసీ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అని విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.