Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 January 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన‌ కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో మ్యాచ్ చేతులు జారిపోతుందనే పరిస్థితి నెలకొంది. అయితే అటువంటి వేళ క్రీజులో నిలిచిన కోహ్లీ, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఆశలు చిగురింపజేశాడు.కేవలం 91 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లీ, అంతర్జాతీయ వన్డేల్లో తన 54వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధికంగా 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్ (18 సార్లు) సరసన కోహ్లీ చేరాడు.

Virat Kohli బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌

Virat Kohli : బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో కోహ్లీ తాగింది ఏంటి.. ఇప్పుడు అందరిలో ఇదే ప్ర‌శ్న‌..!

Virat Kohli ఏం తాగాడు..

విశేషం ఏమిటంటే, పాంటింగ్ ఈ ఘనతను 50 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, కోహ్లీ మాత్రం కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే అదే సంఖ్యను అందుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 71 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి సంక్షోభంలో పడింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఓటమి తప్పదన్న భావన ఏర్పడింది. అప్పుడు కోహ్లీ తన అనుభవాన్ని, సహనాన్ని పూర్తిగా ఉపయోగించాడు. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా ముందుకు నడిపించాడు.నితీష్ రెడ్డి 53 పరుగులతో విలువైన హాఫ్ సెంచరీ సాధించగా, ఇద్దరి మధ్య ఏర్పడిన 70కి పైగా పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. నితీష్ అవుట్ అయిన తర్వాత కూడా కోహ్లీ గేర్ మార్చి ఆడుతూ కివీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకాన్ని పూర్తి చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు.

అయితే ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో కోహ్లీ బ్లాక్ అండ్ రెడ్ బాటిల్‌లో ఓ డ్రింక్ తాగాడు. ఇప్పుడు అది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. డ్రింక్ తాగి వెంట‌నే వాట‌ర్ తాగిన అనంత‌రం అర‌టిపండు కూడా తిన్నాడు. అయితే కఠోరంగా శ్రమించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తాను వీగన్‌గా మారడంతో పాటు.. డైట్ విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ కనబర్చాడు. చివరికి తాను తాగే మంచినీళ్లు కూడా ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతున్నాయి.విరాట్ కోహ్లీ చాన్నాళ్లుగా బ్లాక్ వాటర్ తాగుతున్నాడట‌.ఇది బాడీని హైడ్రేటెడ్‌, ఫిట్‌గానూ ఈ బ్లాక్ వాటర్ ఉంచుతుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. అన్నింటికీ మించి శరీర బరువుని అదుపులో ఉంచుతూ డిప్రెషన్‌ని దరిచేరనివ్వదట.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది